YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన

మంథని 
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుని రుణమాఫీ చేయడం చరిత్రాత్మక నిర్ణయం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు అన్నారు. గురువారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా రైతులందరితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఐటి, పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుద్దిల్ల శ్రీను బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ప్రస్తుత ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి,తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిల్ల శ్రీధర్ బాబు ,ప్రస్తుత రాష్ట్ర సిఎం.పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి  వరంగల్ డిక్లరేషన్ సభ లో  రాహుల్ గాంధీ  సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి  సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు గురువారం మొదటగా  లక్ష రూపాయలు వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు.భారతదేశంలోనే ఒకే సారి రుణమాఫీ చేయడం, ఇది ఒక చారిత్రాత్మక   నిర్ణయమని, ఆగస్టు 15లోగా రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆనాడు మేనిఫెస్టో చైర్మన్ గా శ్రీధర్ బాబు ఉండి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా మేనిఫెస్టోలో రెండు లక్షల వరకు రుణమాఫీ అంశాన్ని పొందుపరచారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న కూడా ఇచ్చిన మాట కోసం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అని  రైతులు  మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అన్నారు.రైతే రాజు చేయలన్నదే మా లక్ష్యం అని అన్నారు.
రానున్న రోజులలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రాంత రైతులందరి తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు పోలు శివ, మాజీ సర్పంచ్ ఓడ్నాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కూల సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, మాజీ ఎంపీపీ కొండా శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు బూడిద శంకర్,ఆకుల కిరణ్, గోటికార్ కిషన్ జీ, కుడుదుల వెంకన్న, తోకల మల్లేష్,ఎరుకల ప్రవీణ్, చంద్రు రాయమల్లు, పెరవేణ లింగయ్య యాదవ్, నాంపల్లి సతీష్, కేక్కర్ల సందీప్ గౌడ్, గుండా రాజు, సదానందం యాదవ్, ఆరేల్లి కిరణ్, సింగిల్ విండో డైరెక్టర్లు రావికంటి సతీష్, కొత్త శ్రీనివాస్ లతో పాటు రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related Posts