YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైజింగ్ లో అమరావతి భూములు

రైజింగ్ లో అమరావతి భూములు

విజయవాడ, జూలై 19,
ఏపీలో ప్రభుత్వం మారడంతో అనుకున్నట్లుగానే  అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతిని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అది అయిపోగానే.. గతంలో నిర్మాణలు మధ్యలో ఆగిపోయిన భవనాల పటిష్టతపై నివేదికలు తెప్పించుకుని.. వాటి నిర్మాణాలను పునంప్రారంభించనున్నారు. అంటే ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. కానీ పట్టాలెక్కడం ఖాయమన్న నమ్మకంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది . కొనుగోలుదారులు .. అమ్మకం దారులు ఎక్కువగా ఉండటంతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. రాజధాని గ్రామాల్లో భూముల అమ్మకాలు కకొనుగోలు ఊపందుకుంటోంది.  జూన్‌ మొదటి వారం నుంచి క్రయవిక్రయాలు పెరగడంతో దరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు  మెట్ట ప్రాంతంలో  గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు అమ్మకాలు జరిగాయి.  ఇప్పుడు రూ.35 నుంచి రూ.40 వేలకు పెరిగింది.  మాగాణి భూముల్లో పోయిన సంసంవత్సరం గజం రూ.30 వేల నుంచి రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.50 వేల నుంచి రూ.60 వేలకు చేరుకుంది. ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంత కాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా భారీగా  పెరుగుతున్నాయి.  తుళ్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరిగాయ. కానీ  గత  పది రోజుల్లోనే 108 రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా తెలుస్తోంది. 2015లో   భూసమీకరణ ద్వారా రైతుల నుంచి 34,772 ఎకరాలను తీసుకుంది.   రైతులకు అభివృద్ధి చేసిన రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని ప్రకటించింది. మూడేళ్లలో రిటర్నబుల్‌ ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొంది. టీడీపీ ప్రభుత్వం కొంత మందికి ఇచ్చింది. వైసీపీ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఐదేళ్లుగా ప్రక్రియ ముందుకు సాగలేదు. జగన్ మూడు రాజధానుల విధానం  ప్రకటించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయిదంి.   భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.  టీడీపీ రావడంతో అమరావతికి కొత్త కళ సంతరించుకుంటుందని భావించి పలువురు రియల్టర్లు, ధనికులు, వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు. భూములిచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకుంటున్నారు.  మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు నివాస స్థలం,  , 200 గజాలు కమర్షియల్‌ స్థలం ఇస్తున్నారు.  రీబు భూమి ఇచ్చిన రైతులకు 1200 గజాలు  నివాస స్థలం  ‌, 250 గజాలు కమర్షియల్‌ ల్యాండ్‌ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్‌ చేసింది. మొత్తం 54 వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్‌గా ఇచ్చింది. ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు. రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని తదితర మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts