YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

లెక్కల్లో ఘనంగా హరితం

లెక్కల్లో ఘనంగా  హరితం
మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం మండలంలో తూతూ మంత్రంగా కొనసాగింది. 18 గ్రామపంచాయతీలు ఉన్న భీంగల్‌ మండలానికి మొదటి విడతలో 7 లక్షల 20 వేల మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఇందుకు మండలంలోని బాబానగర్‌ (2), బడాభీంగల్‌ (1), భీంగల్‌ (3) , మెండోరా (1), పల్లికొండ (2) సికింద్రాపూర్‌ (1) మొత్తం 10 నర్సరీల ద్వారా 8 లక్షల 30 వేల మొక్కలు పెంచేందుకు ప్రణాళికలు చేశారు. కానీ ఇందుకు విరుద్ధంగా అధికారులు 50 గుంతలు తవ్వామని ఇందులో 20 వేల మొక్కలు నాటించి ఒక్కో మొక్కకు 45 చొప్పున అందజేసినట్టు అధికారుల లెక్కలు. కానీ నాటిన 20 వేల మొక్కలను సంరక్షించడంలో అధికారులు విఫలం చెందడంతో ఎక్కడ చిగురించిన దాఖాలాలు ఇప్పట్లో కనబడలేదు.హరితహారంలో చెట్లునాటిన రోజు హంగుహ ర్బాటాలు చేసే అధికారులు వాటిని సంరక్షించడంలో విఫలం అవుతున్నారు. తమ కార్యాలయంలో నాటిన మొక్కలకు ట్రీ గార్టు ఏర్పాటు చేసి వాకి ప్రతి నిత్యం నీరు అందించకపోవడంతో ఆదిలోనే మొక్కలు ఎండిపోతున్నాయి. మొదట మండల స్థాయి అధికారులు మొక్కల పెరుగుదలకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మూడో విడతలో 40 వేల మొక్కలను నాటేందుకు మండలంలో రెండు క్లస్టర్‌లను ఏర్పాటు చేశారు. ఇందుకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ, అటవీశాఖ అధికారులను అనుసంధానం చేసి, మండలంలో ఉపాధిహామీ ద్వారా ఒక నర్సరీ , అటవీశాఖ ద్వారా 8 నర్సరీలను ఏర్పాటు చేసి వాటిల్లో 7 లక్షల 20 వేల మొక్కలను పెంచి సిద్ధం చేశారు. మరో వైపు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మంది కూలీలతో మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకు జూన్‌ రెండో వారం నుంచి పనులు ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. కానీ గత మూడు విడతల్లో అధికారులు చేసిన నిర్లక్ష్యం వాడిపోయిన హరితహరం మూడో విడతలోనైనా చిగురించేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా పరిపాలనాధికారి ద్వారా మండలాల్లోని పలు గ్రామాలలో ఉపాధి, అటవిశాఖల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి వీటి ద్వారా ప్రతి వ్యక్తితో ఒక మొక్కను నాటించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. కానీ కింది స్థాయి అధికారుల అలసత్వంతో ఆచరణలో విఫలం చెందడంతో కోట్ల రూపాయల ప్రజాధనం బూడిదలో పోసీన పన్నీరైంది.హరితహారంలో భాగంగా రైతులకు కూడ మొక్కలను అందజేశారు. వీటి సంరక్షణ కోసం మొక్కకు 5 రూపాయలు అందిస్తున్నామని చెబుతున్నా అధికారుల మాటలు కార్యాలయం మట్టుకే పరిమితం అవుతున్నాయి. రైతుల ఖాతాలలోకి మాత్రం చేరడం లేదు. మండలకేంద్రానికి చెందిన జాప గంగనర్సు సర్వే 377లోని వ్యవసాయ భూమిలో చెట్లు నాటుకునేందుకు దరఖాస్తు చేసుకోగ ఉపాది సిబ్బంది 800 మొక్కలను నాటారు. కానీ నాటి మూడేండ్ల కాలంలో రెండు సార్లు మాత్రమే 4 వేల చొప్పున అందిచారు. ఈ విషయమై సదరు రైతు ట్యాంకర్లతో మొక్కలకు నీరందిస్తు వాటిని సంరక్షించు కుంటున్నాడు. సంరక్షణ ఖర్చుల నిమిత్తం ఎన్ని సార్లు కార్యాలయం చుట్టు తిరుగుతూ ఉపాధి సిబ్బందిని విన్నవించినా ఎవరూ పట్టించుకున్న నాథుడే లేరు. ఇలాంటి రైతులు మండలంలో చాలానే ఉన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని డబ్బులు ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. 

Related Posts