YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పంచాయితీల్లో పట్టు కోసం...

పంచాయితీల్లో పట్టు కోసం...
పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీ నేతలు పల్లెలపై దృష్టి సారిస్తోంస్తున్నారు. గతం కంటే విభిన్న రీతిలో పల్లె పర్యటనలు ముమ్మరం చేస్తున్నారు. పల్లె జనంతో మమేకమవడానికి శుభ, అశుభ కార్యాలను సైతం రాజకీయ వేదికలుగా మల్చుకుంటున్నారు. అత్యధిక సర్పంచిలను గెలిపించుకోవడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.అటు అధికారుల కసరత్తు, ఇటు ఆయా రాజకీయ పార్టీల కదలికలతో పల్లెలలో పంచాయతీ ఎన్నికల వేడి మరింత ఊపందుకుంది. అధికార పక్షం నేతలు ప్రభుత్వ పథకాలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకుంటుంటే, ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఆయా పార్టీలు అధికార పక్షం విధానపరమైన నిర్ణయాలను, పాలనా లోపాలను విమర్శిస్తూ జనాన్ని ఆకర్శించే పనిలో ఉన్నారని ఆయా పార్టీల కదలికలు స్పష్టం చేస్తోన్నాయి. ఆయా పార్టీ అధినేతలు నియోజకవర్గాల ఇంఛార్జీలను పురమాయిస్తున్నారు. పంచాయతీ పోరులో బలాబలాలను నిరూపించుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రధాన పార్టీల నేతలు ద్వితీయశ్రేణి క్యా డర్‌కు సూచిస్తున్నారు. అందుకనుగుణమైన పనిని ప్రణాళికా బద్దంగా చేయాలని ఆదేశిస్తున్నారు.  పంచాయతీ పోరులో పట్టు సాధించి అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావిత శక్తిగా నిలువాలని ప్రధాన రాజకీయ పార్టీల ముందుకు సాగడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల నగారా మోగడం, అధికార యంత్రాంగం అందుకనుగుణమైన కసరత్తు ప్రారంభిచడం, ఓటరులిస్టుల ఫైనల్, ఎన్నికలకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని సమకూర్చుకునే పని, బ్యాలెట్‌బాక్స్‌ల ఏర్పాటు తదితర పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు గ్రామాలలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ పల్లెల్లో పట్టు సాధించేందుకు పల్లె జనంతో మమేకమవడం ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంతో పోటీ పడుతూ పంచాయతీ ఎన్నికలలో పట్టుసాధించేందుకు కసరత్తు చేస్తోంది. అత్యధిక సర్పంచిల గెలుపే ధ్యేయంగా క్యాడర్‌ను కదిలిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను పల్లెలలో ప్రభావితం చేసే విధంగా సర్పంచి స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు ఆ పార్టీ కదలికలుండటం గమనార్హం. ఏదిఏమైనప్పటికీ ఓరుగల్లులో పంచాయతీ పోరుకు పల్లెలు వేడెక్కుతున్నాయనేది గమనార్హం. –వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడు గ్రామీణ మండలాలున్నాయి. మొత్తంగా 1లక్షా 95వేల 398 మంది ఓటర్లున్నారు. మరో లక్ష మందికి పైగా జనాభా కలిగి వరంగల్ అర్బన్ గ్రామీణ మండలాలున్నాయి. అర్బన్ పరిధిలోని ఏడు మండలాలలోని 130 గ్రామ పంచాయతీలున్నారు. ( 104 పాతవి, కొత్తగా పెరిగిన గ్రామపంచాయతీలు 26 కలిపి మొత్తంగా 130 ) 1234 వార్డులు న్నాయి.( ఇందులో పాతవి 1078, కొత్తగా పెరిగినవి 156 ). వరంగల్ అర్బన్ జిల్లా గ్రామీణ జనాభా 2,89,065 లక్షలు ( 2011 జనాభా లెక్కల ప్రకారం) ఉన్నాయి.

Related Posts