వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు అందిస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం అనంతపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు, అర్బన్ సమన్వయకర్త అనంత వెంకట రామిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జెడ్పి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నేతలు పూల మాల వేసి నివాళి అర్పించారు.