ఇటీవల తమిళనాడులో సంచలనం రేకెత్తించిన తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా తూత్తుకుడి వచ్చారు. అయితే ఎలాంటి హడావిడీ లేకుండా సైలెంట్‌గా వచ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి బైక్‌పై విజయ్ తూత్తుకుడి చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. మళ్లీ ఎలాంటి హడావిడీ లేకుండా బైక్‌పై చెన్నై వెళ్లిపోయారు.