YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు

హైదరాబాద్, జూలై 20,
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తలలో ఉంటారు అసదుద్దీన్ ఒవైసీ. ఈ సారి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంఐఎం అధినేత. ఎవరో అజ్ణాత వ్యక్తులు తనని చంపుతామని ఫోన్ కాల్స్ చేస్తున్నారని, బెదిరింపుల మెసేజ్ లు పెడుతున్నారని అంటున్నారు. గతంలోనూ ఒవైసీ చాల సందర్భాలతో తనపై హత్యా ప్రయత్నాలు జరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. బీజేపీ దేశవ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తోందని ఆరోపిస్తున్నారు. అసోంలో సీఎం హిమంత బిశ్వ శర్మ బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని.. తరతరాలుగా వస్తున్న ముస్లిం వివాహ చట్టం రద్దు చేయడమేమిటని ప్రశ్నించారు. పైగా అసోంలో ముస్లిం జనాభా పెరిగిందంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారని వాస్తవాలు కప్పిపుచ్చి ఎక్కవ చెబుతున్నారన్నారు. కేవలం 34 శాతమే ఉన్న ముస్లిం జనాభాను 40 శాతం కింద చూపిస్తున్నారని అన్నారు. కేంద్రం తెచ్చిన యూనిఫాం సివిల్ కోడ్ కుట్రపూరితమని.. మోదీ ప్రభుత్వానికి ముస్లింలపై ఉన్న వ్యతిరేకత చూపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఎన్నికల ప్రచారానికి యూపీ వెళ్లినప్పుడు తనపై దుండగులు తొపాకులతో కాల్పులు జరిపారని అన్నారు. ఆ కేసులో ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదని.. యూపీ ప్రభుత్వం ఆ సంఘటనను చాలా తేలికగా తీసుకుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ముస్లింల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారుకనీసం ముస్లిం పెద్దల సలహాలు, సూచనలు తీసుకోకుండా ఏక పక్షంగా చట్టాలను రద్దు చేయడం భావ్యం కాదని అన్నారు.తాను కేవలం ముస్లింల పక్షానే కాదు దేశ వ్యాప్తంగా బలహీన వర్గాలు, దళితుల పక్షాన మాట్లాటుతున్నానని అంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ముస్లింలను బలవంతంగా అణగదొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అసదుద్దీన్. దేశంలో మైనారిటీలను చిన్నచూపు చూస్తున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని అన్నారు. తాను ముస్లింల గొంతుకై వారి తరపున ప్రశ్నిస్తున్నందుకే బెదిరింపులు వస్తున్నాయని..దీని వెనుక ఎవరు ఉన్నారో, ఏ శక్తులు ఉన్నాయో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ ఎదుగుతోందని..పార్లమెంట్ లో స్థానాలు పెంచుకుంటున్నామని అన్నారు. తమ ఎదుగుదల చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని అన్నారు. కొన్ని హిందూ టెర్రరిస్ట్ సంస్థలే తనను బెదిరిస్తున్నాయని త్వరలోనే వాళ్ల గుట్టు బయటపడుతుందని అసదుద్దీన్ అన్నారు

Related Posts