YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏఈఈ లకు నియామక పత్రాలిచ్చిన మంత్రి తుమ్మల

ఏఈఈ లకు నియామక పత్రాలిచ్చిన మంత్రి తుమ్మల
రహదారులు మరియు భవనముల శాఖలో కొత్తగా  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  ద్వారా ఎంపికైన ఏఈఈ అభ్యర్థులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  బుధవారం నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఇఎన్సీ గణపతి రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ఇఎన్సీ గణపతి రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎంపికైన అభ్యర్థుల కు  అభినందనలు తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం లో అత్యంత మంచి పేరు శాఖ మన ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ కు ఉంది. మనకు అపార అనుభవం ఉన్న మంత్రి ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యం అయింది. మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చి సమాజానికి ఉపయోగపడేలా తయారు చేస్తామని అన్నారు. క్రమశిక్షణ గల ఇంజనీర్లు గా పని చేసి డిపార్ట్మెంట్ కు ప్రభుత్వం కు మంచి పేరు తేవాలని అయన అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన ఏఈఈ లకు  ధన్యవాదాలు, మీ తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. గతంలో అనేక అక్రమాల ద్వారా ఉద్యోగాలు పొందేవారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వలన టిఎస్పీఎస్ ద్వారా ప్రతిభ కలిగిన వారు మాత్రమే ఎన్నిక అయ్యారు. క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్ మన ఆర్&బి డిపార్ట్మెంట్. గతంలో అనేక అక్రమాలు జరిగాయి.కానీ ఇప్పుడు ఎక్కడ అక్రమాలకు తావులేకుండా చేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఇఎన్సీ లకు 30 సంవత్సరాల అనుభవం ఉండవచ్చు కానీ 30 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టని నిధులు ఈ 4 సంవత్సరాలా కాలంలో ఖర్చు పెట్టారు రోడ్ల భవనాల శాఖకు. గతంలో ఇంజనీర్ ఉద్యోగం రావాలంటే ఎన్నో ఫైరవిలు ఉండేవి. ముఖ్యమంత్రి దక్షతతో నిజమైన ప్రతిభావంతులైన వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వ బ్యాచ్ ఇది. కీర్తి, ప్రతిష్టలు తెచ్చుకోవాలని అన్నారు. కొందరు అపోహలు, అప్రతిష్ట తీసుకురావాలి చూస్తున్నారు. అందరి కోసం నిర్ణయాలు ఉంటాయి తప్ప... ఏ ఒక్కరికోసం నిర్ణయాలు. సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తామంటే చూస్తూ ఉరుకోం. డిపార్ట్మెంట్ ను ఒకరకంగా హెచ్చరిస్తున్నా. డిపార్ట్మెంట్ ను బధనాం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఎన్నో వేల కిలోమీటర్ల నూతన రోడ్డు నిర్మించాం.. ఇంకా మారుమూల ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సి ఉంది. తెలివైన వారే ఆర్ అండ్ బికి వస్తున్నారు. ఇది డిపార్ట్మెంట్ అదృష్టమని అన్నారు. 

Related Posts