స్పోర్ట్స్ కోటకింద మెడికల్ సీట్ల కుంభకోణం కేస్ లో స్పోర్ట్స్ కమిటీ సభ్యుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. స్పోర్ట్స్ కోటలో భర్తీ చేసే మెడికల్ సీట్లలో కుంభకోణం జరిగిందని విద్యార్థులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ప్రభుత్వం తరుపున ద్విసభ్య కమిటి వేసి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. స్పోర్ట్స్ కోటా లో ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకున్న వ్యవహారం ఫై కేసు నమోదు అయింది. బుధవారం నాడు ఊసీబీ హైదరాబాద్ లోఐడు 5 చోట్ల దాడులు చేసింది. హబ్సిగూడ , ఎల్బీ స్టేడియం తో పాటు సాప్ కమిటీ లో ఉన్న ఐదుగురి నివాసాలలో సోదాలు జరిగింది. రామంతపూర్ లోని రవీందర్ నగర్ లో షాప్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట రమణ ఇంటి ఫై కుడా దాడులు జరిపింది. ఏల్ బి నగర్ సరస్వతి కాలని లో ఉంటున్న గుర్రం చంద్ర రెడ్డి (ఉస్మానియా యూనివర్సిటీ లో స్పోర్ట్స్ విభాగంలో పనిచేస్తున్నా సైకిలింగ్ కోచ్) ఇంట్లో కుడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. హబ్సిగూడ. రవీంద్ర నగర్ లో కమిటీ సభ్యురాలు శోభ ఇంటిలో కుడా ఏసీబీ సోదాలు జరిగాయి.