YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నకిలీ డాక్టర్ గుట్టు రట్టు

నకిలీ డాక్టర్ గుట్టు రట్టు

సత్తుపల్లి
ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో ఓ నకిలీ వైద్యుడు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రిని నడుపుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లచ్చన్న గూడెం గ్రామానికి చెందిన ఏకే ప్రసాద్ అనే డిఫార్మసీ చేసిన వ్యక్తి వైద్యంలో ఎలాంటి అనుభవం లేని ప్రసాద్ మర్లపాడు సెంటర్లో పదికి పైగా పడకలు ఏర్పాటు చేసి ఓ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. మెడికల్ షాప్ తో ప్రారంభమైన తన వ్యాపారం అంచెలంచెలుగా పెరుగుతూ ఒక కార్పొరేట్ స్థాయిలో పదికి పైగా పడకలు ఏర్పాటుచేసి తానే స్వయంగా వైద్యం చేయడం ప్రారంభించాడు. ఈ నకిలీ వైద్యుడు వద్ద వైద్యం చేయించుకునేందుకు అటు ఆంధ్ర గ్రామాల నుంచి ఇటు తెలంగాణ గ్రామాల నుంచి కుప్పలు కుప్పలుగా రోగులు వస్తుంటారు. నకిలీ ఆసుపత్రికి కూతవేటు దూరంలోనే వేంసూరు ప్రభుత్వాసుపత్రి ఉంటుంది. ఈ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీతారాం... నకిలీ ఆసుపత్రి నడుపుతున్నా ఈ నకిలీ వైద్యుడు పై ఏనాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రి పై ఆధికారులు డులు నిర్వహించారు. వేంసూరు మండలం లోని మర్లపాడు గ్రామం లో ఆనాధికారకంగా 10కి పైగా పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్న నకిలీ వైద్యుడు కు నోటీసులు ఇచ్చారు. మెడికల్ స్టోర్ పేరుతో డాక్టరు లేకుండానే రోగులకు వైద్యం చేస్తుండగా డిప్యూటీ డీఎంహెచ్వో  దాడులు చేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. డిఎం అండ్ హెచ్ ఓ నకిలీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో బెడ్లు అయి రోగులకు కిటికీలకు సెలైన్ బాటిల్స్ కట్టి వేలాడదీస్తూ రోగులకు ఎక్కించడం అక్కడ పరిస్థితిని చూపిస్తుంది. ఇదే నకిలీ వైద్యుడు గతంలో కూడా డెంగ్యూ లాంటి వ్యాధులకు వైద్యం చేసిన దాఖలాలు వచ్చినప్పటికీ కూడా క్షమించాను అంటూ మాట్లాడటం కొసమెరుపు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామాలలో వైద్యం చెయ్యకూడదని, అలాంటి వారి పై చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య అధికారులు తెలిపారు. ఆర్ఎంపి  వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు.ఇట్టి విషయం పై ఆసుపత్రి నిర్వహిస్తున్న ఎకే  ప్రసాద్ ను వివరణ కోరగా తాను 10 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను, తన తండ్రి ఆర్ఎంపి  వైద్యుడు గా పని చెయ్యడంతో తాను కూడా అదే వృత్తి కొనసాగిస్తున్నానని, కేవలం డి ఫార్మసీ  చదివి మెడికల్ షాపు తో పాటు బెడ్లు వేసి వైద్యం చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. తన ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్వో పరిశీలించి ఎలాంటి అనుమతులు లేని కారణంగా ఆసుపత్రి పేరుతో వైద్యం చెయ్యకూడదు అని నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆయన వివరించారు.

Related Posts