YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికి రుణమాఫీ చేయాలి

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికి రుణమాఫీ చేయాలి

మంథని 
ఎన్నికల సమయంలో రైతులందరికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టి రైతులను ఆగం చేస్తున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికి రుణమాఫీ చేయాలని
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికి రుణమాపీ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం విన్నూత్న రీతిలో చెవ్విలో పువ్వులు పెట్టుకుని మంథని పట్టణంలోని జాతిపిత గాంధీ విగ్రహానికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం హింసలేకుండా అహింసామార్గంలో శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీ పేరుతో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్‌ ఆయన ఆశయాలకు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. డిసెంబర్‌ 9న అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించి ఈనాడు 567జీఓ తీసుకువచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టే కుట్ర చేశారన్నారు. రైతుబంధు లేకుండా రైతుభరోసా పేరు చెప్పిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
రైతుల చెవ్వుల్లో పూలు పెట్టి రైతురుణమాఫీ చేశామని సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరిపించాలని, గాంధీ ఆశయాలను చెప్పుకుంటున్న పాలకులు కళ్లు తెరువాలని మహాత్మాగాంధీకి వినతిపత్రం అందజేయడం జరుగుతుందన్నారు. తాము రుణమాఫీ చేస్తామనగానే కేసీఆర్‌ లక్ష రుణమాఫీ చేస్తున్నాడని, తాము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇప్పుడే బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండని డిసెంబర్‌ 9న మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీలో ఆంక్షలు పెట్టి అనేక నిబంధనలను తెరపైకి తీసుకువచ్చారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదుగేలా ప్రోత్సహిస్తున్నామని ఒక వైపు చెప్తూనే మరోవైపు మహిళా సంఘాల్లో ఉన్న మహిళా రైతులకు రుణమాఫీ వర్తించదని, పీఎం కిసాన్‌ సాయం పొందేవాళ్లకు అనర్హులంటూ ఆంక్షలు పెట్టారని ఆయన విమర్శించారు.పంటల సాగు మొదలై నాట్లు జరుగుతున్నా ఇప్పటికి రుణమాఫీ లేదు రైతుబంధు రైతుభరోసా లేదని ఆయన అన్నారు. గాంధీజీ తెల్ల టోపి ధరించి శాంతి మార్గాన్ని చూపిస్తే ఈనాడు కాంగ్రెస్సోళ్లు అదే తెల్లటోపిని ధరించి దేశాన్ని రాష్ట్రాన్ని, గ్రామాలను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసమే పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్ర్యం వచ్చాక అలాగే కొనసాగితే దేశం సర్వనాశనం అవుతుందని ఆనాడే గాందీ చెప్పారని, ఆయన మాటలు పెడచెవిన పెట్టి కాంగ్రెస్‌ పార్టీని కొనసాగిస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతును ఆదుకున్న చరిత్ర ఉందని, ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం, రైతు బీమాలాంటి పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే ఉందన్నారు.కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పి పాలిస్తోందన్నారు.దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మగాందీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రైతులను ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ గోలపు శంకర్ గౌడ్, తగరం శంకర్ లాల్, సెగ్గిం రాజేష్, బత్తుల సత్యనారాయణ, కౌన్సిలర్లు ఆరేపల్లి కుమార్, కాయితి సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, నాయకులు కనవేన శ్రీనివాస్ యాదవ్, జంజర్ల శేఖర్, ఆసిఫ్ ఖాన్, ఇర్ఫాన్ లతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts