YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మొబైల్‌-ఆధార్‌ లంకె: సులువుగా ఇలా..

మొబైల్‌-ఆధార్‌ లంకె: సులువుగా ఇలా..

మీ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే ఈ వార్త మీకోసమే. ఇంతకు ముందులా ఆధార్‌ అనుసంధానానికి రిటైల్‌ స్టోర్లకు పరుగులు పెట్టకుండా సులువుగా ఆధార్‌ అనుసంధానం చేసే పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో మీ ఇంటి వద్దే మీ మొబైల్‌ నుంచే ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయొచ్చు. ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.

ఇందు కోసం మీరు మీ ఆధార్‌ నంబర్‌ను, మొబైల్‌ను కలిగి ఉంటే చాలు. ఎయిర్‌టెల్‌, ఐడియా, జియో, వొడాఫోన్‌ ఇలా ఏ నెట్‌వర్క్‌ కస్టమర్‌ అయినా సరే మీ ఫోన్‌ నుంచి 14546 నంబర్‌ను డయల్‌ చేయాల్సి ఉంటుంది.

* తొలుత ఈ ఆ నంబర్‌కు డయల్‌ చేయగానే మీరు ఇండియాకు చెందిన వారా లేదా ఎన్నారై కస్టమరా అడుగుతుంది. అందులో ఒక ఐచ్చికాన్ని ఎంపిక చేసుకోవాలి.

* ఆ తర్వాత 1ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆధార్‌ నంబర్‌ను పొందుపరిచిన తర్వాత మళ్లీ 1ని నొక్కాలి.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు ఓ వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది.

* ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌లోని చివరి నాలుగు అంకెలను ధ్రువీకరించాల్సి ఉంటుంది.

* మొబైల్‌ నంబర్‌ ధ్రువీకరణ అనంతరం మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1ని నొక్కడం ద్వారా మీ ఆధార్‌ నంబర్‌ రీ వెరిఫికేషన్‌ను పూర్తిచేయొచ్చు.

* ఒకవేళ మీరు ఇది వరకే ఆధార్‌ అనుసంధానం చేసి ఉంటే ముందుగానే ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అర్ధగంటపాటు చెల్లుబాటు అవుతుంది.

Related Posts