బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్ ప్రకటించింది. ఎస్‌టీవీ-191తో రీచార్జ్ చేసుకుంటే ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటుఅపరిమిత ఫోన్ కాల్స్, అపరిమిత డేటాతో పాటు రోజుకు 300 ఎస్‌ఎంఎస్‌లు వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే, రోజులో 1జీబీ డేటా వినియోగం పూర్తయ్యాక 80 కేబీపీఎస్ స్పీడ్ వర్తిస్తుంది. మంగళవారం నుంచి ఈ ఆఫర్ మలులోకి వచ్చిందని తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం సుందర్ తెలిపారు .