కడప
వేంపల్లి లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పాపాగ్ని నదిలో అక్రమ ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు వేంపల్లి సిఐ చాంద్ భాషా తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇసుక విషయం లో జోక్యం చేసుకోవద్దని పార్టీ నాయకులను హెచ్చరించారు.