YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాము

విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాము

న్యూఢిల్లీ, జూలై 23
పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేంటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఏపీలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ.. సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులను కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామక కారిడార్‌కు నిధులు చేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామన్నారు. విభజన చట్టం ప్రకారంఐదు పథకాల కోసం పీఎం ప్యాకేజీ విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు

Related Posts