న్యూఢిల్లీ, జూలై 23
ఎన్డీయే 3.0 కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యంగా ఉన్న ఏపీ, బీహార్‌లకు కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ) వరాల జల్లు కురిపించారు. ఏపీలో రాజధాని అమరావతికిప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే, నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్‌కు పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటించారు. అయితే, బీహార్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్‌ను మాత్రం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బీహార్‌లో వివిద ప్రాజెక్టుల కోసం రూ.26 వేల కోట్లు కేటాయించారు. అక్కడ ఎయిర్ పోర్టులు, విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అలాగే, జార్ఘండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అభివృద్ధికి కూడా ప్రణాళిక రూపొందిస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌లో వరాల జల్లు కురిపించారు. విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటించి చేయూత అందించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి పూర్తిగా సాయం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రైతులకు పోలవరం జీవనాడి అని.. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైనదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వెంటనే జరిగేలా చూస్తామన్నారు.
ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే, విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. హైదరాబాద్ - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి కూడా ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామన్నారు. అలాగే, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని వెల్లడించారు.బీహార్‌లో కొత్త విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఆర్థిక సాయం. పీర్ పాయింట్ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో సహా విద్యుత్ ప్రాజెక్టులు చేపడతారు.
గయాలో ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధి, పాట్నా - పూర్ణియా ఎక్స్ ప్రెస్ వే, బక్సర్ - భాగల్పూర్ హైవే, బోద్‌గయా - రాజ్‌గిర్ - వైశాలి - దర్బంగా, బక్సర్‌లో గంగానదిపై రూ.26 వేల కోట్లతో వంతెనల అభివృద్ధికి సాయం చేస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.
ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ ఫండ్ ద్వారా బీహార్‌లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు. అలాగే, టెంపుల్ కారిడార్లు, నలంద యూనివర్శిటీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ నేతల ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్‌కు బడ్దెట్‌లో ప్రాధాన్యం దక్కింది. అమరావతికి రూ. పదిహేను వేల కోట్లు ప్రకటించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరానికి పెట్టే ప్రతి ఖర్చు నాబార్డు ద్వారా రీఎంబర్స్ చేస్తారు కాబట్టి బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎంత మొత్తం అని చెప్పలేదు. ఇంకా ఏపీకి పారిశ్రామిక కారిడార్లు కూడా ప్రకటించారు. ఈ కేటాయింపులపై టీడీపీ నేతలు సంతృప్తి ప్రకటించారు. అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వెలిబుచ్చారు. ఏపీ ఆశించినవన్నీ కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెడతాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం మరోసారి స్పష్టంగా హామీ ఇవ్వడం .. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాలకు నిధులిస్తామని చెప్పడం రాష్ట్ర ప్రగతికి తొడ్పడుతుందని విశ్లేషించారు. ఏ ఏపీలో పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం ఇవ్వడం వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు పుంజుకునేలా కేంద్ర బడ్జెట్ లఉందన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కేటాయింపులు చేశారనితాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతోషం ప్రకటించారు. రాజధాని అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృృతజ్ఞతలుతెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించారని దీని వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రేదశ్ కు కేంద్రం ప్రత్యేక సాయం చేయడంపై జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ( సంతోషం వ్యక్తం చేశారు. జనసేన తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రకటన జారీ చచేేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని.. పోలవరం ప్రాజెక్టుకు 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని చెప్పారని .. ..దేశానికి ఆహార భద్రత కల్పించాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఇవన్నీ ఏపీకి ఎంతో మేలు చేస్తాయన్నారు.