YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 8 పైసలు తగ్గింపు

వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 8 పైసలు తగ్గింపు
గత ఏడు రోజులగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై 11 పైసలు, డీజిల్‌పై 8 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది.తాజా తగ్గింపుతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 77.72గా ఉంది. ముంబయిలో రూ. 85.54, కోల్‌కతాలో రూ. 80.37, చెన్నైలో రూ. 80.68గా ఉంది. ఇక లీటర్‌ డీజిల్‌ ధర దిల్లీలో రూ. 68.80, ముంబయిలో రూ. 73.25, కోల్‌కతాలో రూ. 71.35, చెన్నైలో రూ. 72.64గా ఉంది. మొత్తానికి వరుసగా గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్‌ ధర 71పైసలు; ఏడు రోజుల్లో డీజిల్‌ ధర 53 పైసలు తగ్గింది.ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. మే 14 నుంచి వరుసగా 16రోజుల పాటు చమురు ధరలు పెరుగుతూ పోయాయి. మొత్తంగా ఆ 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై ధర రూ. 3.80, డీజిల్‌పై ధర రూ. 3.38 వరకు పెరిగింది.

Related Posts