YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బడ్జెట్ లో పెరిగేవి... తగ్గేవి ఇవే

బడ్జెట్ లో పెరిగేవి... తగ్గేవి ఇవే

న్యూఢిల్లీ, జూలై 23
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం 2024-25 కోసం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. సామాన్యులకు వివిధ వస్తువుల ధరలను ప్రభావితం చేసే విధానాలను ప్రకటించారు.  2024-25 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగానికి సంబంధించి 3 రకాల క్యాన్సర్‌ మందులపై కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా తొలగించింది. ఎక్స్‌రే పరికరాలపై సైతం పన్ను తగ్గించారు. మొబైల్‌ ఫోన్లు, పరికరాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 15 శాతానికి తగ్గించారు. పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే చర్యలలో భాగంగా 25 రకాల కీలక ఖనిజాలపై కస్టమ్స్‌ డ్యూటీని ప్రభుత్వం తగ్గించింది. మెరైన్ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం రొయ్యలు, చేపల ఫీడ్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 5శాతానికి తగ్గించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు పాస్టిక్ దిగుమతులపై బడ్జెట్లో అదననంగా పన్ను పెంచారు. గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను తగ్గించారు. పౌర విమానయాన రంగంలో వేగవంతమైన అభివృద్ధి చర్యలలో భాగంగా విమాన టికెట్ల ధరలపై పన్ను తగ్గించారు. GST కారణంగా సామాన్యులపై పన్నుల భారం తగ్గిందని మరింత సరళంగా, హేతుబద్ధంగా GSTని మార్చుతామని నిర్మల సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు.  జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీతారామన్ చెప్పారు. మునుపటి సంవత్సరం బడ్జెట్ సెషన్‌లో, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల ఫీడ్, వజ్రాలు వంటి వస్తువుల ధరలు తగ్గించబడ్డాయి.  అయితే సిగరెట్లు, విమాన ప్రయాణం, వస్త్రాల ఖర్చులు పెరిగాయి.
తాజా బడ్జెట్‌లో చౌక, ఖరీదైన వస్తువుల పూర్తి జాబితా దిగువన ఉంది:
చౌకగా మారిన వస్తువులు:
➤మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ పీసీడీఏ, మొబైల్‌ ఛార్జర్లపై విధించే బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
➤బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6%కి, ప్లాటినంపై 6.4%కి తగ్గింపు
➤ క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
➤  ఫెర్రో నికిల్, బ్లిస్టర్ కాపర్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➤ చౌకగా లభించనున్న లెదర్‌ వస్తువులు, సీఫుడ్‌
➤ సోలార్ ప్యానెళ్ల తయారీలో ఉపయోగించే మినహాయింపు పొందిన మూలధన వస్తువుల జాబితాను విస్తరించాలని ప్రభుత్వ ప్రతిపాదన
➤ ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలపై పన్ను రేటును కూడా తగ్గింపు
➤  25 కీలక ఖనిజాలపై కూడా కస్టమ్స్ సుంకం మినహాయింపు
➤ రొయ్యల, చేపల మేతపై, బ్రూడ్ స్టాక్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గింపు
ఖరీదైన వస్తువులు:
➤ టెలికాం పరికరాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 10% నుండి 15%కి పెంపు
➤ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ 25 శాతం పెంపు
➤ అమ్మోనియం నైట్రేట్‌పై కస్టమ్స్ డ్యూటీని 10 శాతం పెంపు
➤ నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్పై 25 శాతం కస్టమ్స్ సుంకం పెంపు    

Related Posts