YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సంగారెడ్డి
జీవితంలో ఒకరి సపోర్ట్ లేకపోతే చాలకష్టమని, తన చిన్నతనం నుంచి నచ్చిన చదువు చదవలేదని, నచ్చిన బట్టలు వేయలేకపోయానంటూ, నచ్చిన జీవితాన్ని గడపడం లేదంటూ డిప్రషన్ లో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పి ఎస్ పరిధిలోని తెల్లాపూర్   విద్యుత్తు నగర్ లో నివాసముంటున్న కిరణ్ (25) విప్రో కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నతనంలోనే అమ్మ చనిపోవడంతో నానమ్మ వద్దనే ఉంటున్నాడు. చిన్న తనం నుంచే తనకు నచ్చిన ఏ ఒక్క పని చేయకుండా, జీవితంలో ఎవరి సపోర్ట్ లేకుండా ఉండడం కష్టమంటూ, నా చావుకు కేవలం నా కుటుంబం మాత్రమే అంటూ, నానమ్మ నీకు మాత్రమే రుణపడి ఉంటానంటూ సూసైడ్ లెటర్ రాసి పెట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ లభ్యమవడంతో దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts