వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ ఆరోపణల పై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రియమైన ప్రతిపక్ష నేత గారు, నారా మరియు వైఎస్ ఇంటి పేరులకు చాలా వ్యత్యాసం వుంది. మేము అభివృద్ధి మార్గం ఎంచుకుంటే,మీరు అవినీతి,అక్రమాలు వైపు వుంటారు. రాజకీయాలలో ఆస్తులు ప్రకటించేది మా కుటుంబం మాత్రమే, మీకు మీ ఆస్తులు ప్రకటించే దమ్ము ఉందా ని ప్రశ్నించారు. మా కుటుంబం 25 ఏళ్ల శ్రమ ఫలితం హెరిటేజ్,నిరంతరం సంస్థ ఎదుగుదల కోసం మా అమ్మ, బ్రాహ్మణి కష్ట పడుతున్నారు. హెరిటేజ్ విలువలతో ఎదిగిన సంస్థ కాబట్టే,మీ తండ్రి 20 కి పైగా కేసులు పెట్టి ఒక్క ఆధారం కూడా చూపించ లేకపోయారు. ఇప్పటికైనా మీలో పరివర్తన వచ్చి సక్రమ మార్గంలో నడుచుకోవాలి అని కోరుకుంటున్నానని అన్నారు.