YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ హయంలో ఆర్టీసీని నిర్వర్యం చేసారు మంత్రి పొన్నం

బీఆర్ఎస్ హయంలో ఆర్టీసీని నిర్వర్యం చేసారు మంత్రి పొన్నం

హైదరాబాద్
ఆర్టీసీని చంపి ఆర్టీసి ఉంటదా తీసేస్తారా  అనే పరిస్థితుల్లో రిటైర్డు ఎక్స్క్యూటివ్ డైరెక్టర్ నీ ఎండీ గా పెట్టీ ఆర్టీసి నీ నిర్వీర్యం చేశారుని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం నాడు శాసనసభలో అయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఉద్యోగుల మీద ఒక కమిటీ వేసి 10 సంవత్సరాల్లో  చేయకుండా ఎన్నికల ముందు ఎలాంటి సంప్రదింపులు జరపకుండా  ఎలాంటి చర్చ లేకుండా ఆర్టీసి యాజమాన్యం తో కూడా మాట్లాడకుండా ఆదరాబాదరాగా  తీసుకొచ్చారు. దానికి రాజకీయ రంగు పిలవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని గవర్నర్ ఇంటి ముందు ధర్నా చేపించిన మాట్లాడుతున్నారు. కార్మిక సంస్థలను రద్దు చేసి వీళ్ళు యూనియన్ల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఏం హక్కు ఉంది..రద్దు చేసిన మీరు పునరుద్ధరణ గురించి మాట్లాడే హక్కు ఉందా. కార్మికులకు ముందు క్షమాపణ చెప్పి అడగండి. ఆర్టీసి  అధ్యక్షడు గా మీరు,మీ కుటుంబ సభ్యులు ఉండి 50 రోజులు సమ్మె చేస్తూ కార్మికులు చనిపోయిన పట్టించుకోని ఇప్పుడు మాట్లాడతారా. 10 సంవత్సరాల్లో ఒక్క బస్సు అయినా కొన్నారా.? మా ప్రభుత్వం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి   నేతృత్వంలో కొత్త బస్సులు కొన్నది. 2013 నుండి పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బాండ్ల బకాయిలు 80 కోట్లు చేల్లించాం. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల రీత్యా కడుతుందని అన్నారు.
మా ప్రభుత్వం వచ్చిన తరువాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్, సీసీఎస్ నిధులు వాడుకోలేదు. 4 వేల కోట్ల కార్మికుల పైసలు మీ ప్రభుత్వం వాడుకుంది. ఆర్టీసి 7 వేల కోట్లతో మాకు అప్పగించారు.  ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద  నెలకు 300 కోట్లు కేటాయిస్తుంది. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఆర్టీసి లో ప్రయాణం చేశారు. 2400 కోట్ల రూపాయల మేర ప్రయాణం చేస్తే 2000 కోట్లు  ప్రభుత్వం మహ లక్ష్మి ద్వారా ఆర్టీసి చెల్లించిందని అన్నారు.
చనిపోయిన ఆర్టీసి కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. ఆర్టీసి తార్నాక హాస్పిటల్ లో సిటీ స్కాన్, ఎమ్మారై, అధునాతన సౌకర్యాలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. 45 లక్షల మంది ప్రయాణం చేసే సంస్థ నిత్యం 56 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 3035 ఉద్యోగాలకు నియామకాలు చేస్తున్నాం. ఆర్టీసి లో ఉన్న డ్రైవర్లకు కండక్టర్లకు మా ప్రభుత్వం తరుపున అభినందనలు తెలుపుతున్న. ఓవర్ లోడ్ అయిన మాట వాస్తవమే పని భారం పెరిగిన 8 గంటల తరువాత కూడా పని చేసే వారికి పెమెంట్ చేస్తున్నాం. 95 శాతం అక్యుపెన్సి పెరిగింది. నష్టాల  ఉన్న ఆర్టీసి ఈ 3 నెలల్లో ఆపరేషనల్ లాస్ లేకుండా ఓవర్ కం ద్వారా బయట పడుతున్నాం. ఆర్టీసి ఉంటాదో ఉండదో అనే పరిస్థితి నుండి ఆర్టీసి ముందుకు తీసుకెళ్ళం. మీ బంధువు అయినా ఈడి నీ ఎండీ చేశారు. 50 రోజులు సమ్మె చేసిన పట్టించుకోలేదు. 50 వేల ఆర్టీసి  కార్మికుల కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి..మనం గెలవలేమని విలీనం అనే అంశన్ని ఎన్నికల ముందు తెచ్చారు. అయినా వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆర్టీసి ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇచ్చాం. 35 కోట్ల అదనపు భారం వుంది.
2013 నుండి ఉన్న 280 కోట్ల బకాయిల్లో 80 కోట్లు విడుదల చేసింది. మిగిలినవి కూడా త్వరలోనే విడుదల చేస్తాం. ఆర్టీసి కార్మికుల పై మీకు చిత్తశుద్ది  ఉంటే 10 సంవత్సరాల్లో ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు. ఆర్టీసి ఆస్తులను వాళ్ల పార్టీ నాయకులకు అప్పనంగా తక్కువ ధరలకు అప్పగించారు. మా ప్రభుత్వానికి ఆర్టీసి కార్మికుల సంక్షేమం ప్రజా రవాణా సౌకర్యం మా బాధ్యత. కార్మికులకు సంబంధించి భవిష్యత్ లో అన్ని చర్యలు తీసుకుంటాం. ఆర్టీసి కార్మికులకు సంబంధించి మాట్లాడే నైతిక అర్హత బి ఆర్ఎస్ నేతలకు లేదు. బడ్జెట్ లో 1500 కోట్లు పెట్టీ 400 కోట్లు కూడా కేటాయించకపోయేది. ఆర్టీసి ఉద్యోగుల అంశం పరిశీలన లో ఉందని అన్నారు.

Related Posts