YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ కేసు లో ప్రతిపక్ష నేత జగన్‌వి నిరాధార ఆరోపణలు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

అగ్రిగోల్డ్ కేసు లో ప్రతిపక్ష నేత జగన్‌వి నిరాధార ఆరోపణలు        ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు
అగ్రిగోల్డ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఎవరికైనా  అనుమానాలుంటే హైకోర్టులో ఇంప్లీడ్‌ కావాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూచించారు. అగ్రిగోల్డ్ కేసు అంశంలో ప్రతిపక్ష నేత జగన్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయనమండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దురుద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీ దీన్ని రాజకీయం చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ వివాదంపై ప్రభుత్వ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాదులైన జగన్‌, విజయసాయిరెడ్డిలు ఏ అంశానైన్నా రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా ప్రధాన కార్యదర్శి జీవీఎల్‌ నరసింహరావు చేసిన వ్యాఖ్యలను కుటుంబరావు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధి అంతా కాగితాలకే పరిమితమైందన్న నరసింహరావు.. ఆ విషయాన్ని గ్రామాల్లో పర్యటించిన తర్వాత చెప్పాలని సవాల్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభుత్వ అధికారులపై నమ్మకం లేనట్లుగా ఉందన్నారు. జీవీఎల్‌ వ్యాఖ్యల్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్టాక్‌ మార్కెట్‌లో పనిచేసిన వ్యక్తులు అడ్మినిస్టేషన్‌లో ఉండకూడదా? అని ప్రశ్నించారు. ఏ రంగంలోనైనా నిపుణులైన వారిని ప్రభుత్వాలు సలహాదారులుగా నియమించుకోవడం సాధారణమేనన్నారు. ఈరోజు జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడిన తీరుతో ఆయనపై గౌరవం పోయిందని కుటుంబరావు అన్నారు. నిజాలు చెప్పాలని అడిగితే అసహనానికి ఎందుకు గురవుతున్నారో అర్థం కావడం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని.. కానీ 150కి మించి సీట్లు రావని కుటుంబరావు తెలిపారు. జీవీఎల్‌ తన వ్యాఖ్యలను రాసుకుని ఎన్నికల ఫలితాల తర్వాత చూసుకోవాలన్నారు. జీవీఎల్‌ రాష్ట్ర ప్రభుత్వంపై ఇకనైనా తన లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని కోరారు. ఏ విషయంపైనా స్పష్టత లేకుండా గూగుల్‌లో సెర్చ్ చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Related Posts