YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి

శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారి

హైదరాబాద్
రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితను జైల్లో పెట్టారని  సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ అధ్యక్షతన భారాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన సమావేశంలో ఉభయ సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగడం ఇదే తొలిసారి.
నేను ఇప్పుడు అగ్నిపర్వతంలా ఉన్నా. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే తెలంగాణ సాధించా. నలుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేలు బాగా ఎదుగుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై పట్టు సాధించలేకపోయింది. పాలనపై దృష్టి పెట్టకుండా భారాసను అబాసుపాలు చేసే పనిలో ఉన్నారు. శాంతి భద్రతలు ఎందుకు అదుపుతప్పుతాయి? ఎక్కడో ఉన్న వారిని నేతలను చేస్తే.. పదవులు వచ్చాక పార్టీని వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ అన్నారు. శాసనమండలిలో బిఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని ప్రకటించారు.

Related Posts