YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమస్యలను ఓపికగా వింటూ...వినతులు స్వీకరించిన భువనేశ్వరి

సమస్యలను ఓపికగా వింటూ...వినతులు స్వీకరించిన భువనేశ్వరి

కుప్పం
రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4రోజులు పర్యటనలో భాగంగా మొదటి రోజు విజయవంతంగా పూర్తయ్యింది. ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి కమ్మగుట్టపల్లి గ్రామం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించారు. భువనమ్మకు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా భువనేశ్వరి కి నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ మహిళలు భువనమ్మకు హారతులు పట్టి స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లిలో పూర్ణకలశాలు, మంగళవాయిద్యాలతో భారీ ర్యాలీతో మహిళలు స్వాగతం పలికారు. కమ్మగుట్టపల్లి గ్రామంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. నియోజకవర్గ నాయకులు, మహిళలకు కృతజ్ఞతలు తెలిపిన భువనేశ్వరి, మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆరా తీశారు. అదేవిధంగా సమస్యలపై వినతిపత్రాలను తీసుకుని, ప్రజలు చెప్పే సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కంచిబందార్లపల్లి గ్రామంలో నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన కారణంగా భువనేశ్వరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆ గ్రామాన్ని నేడు దత్తత తీసుకున్నారు. కంచిబందార్లపల్లి గ్రామాన్ని రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని గ్రామాస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లోనూ భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలతో ముచ్చటించారు. చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, తనవంతు తాను కూడా కుప్పం ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో భువనేశ్వరికి నియోజకవర్గ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందించారు. మొదటి రోజు కుప్పం పర్యటనకు నియోజకవర్గ ప్రజల నుండి భారీ స్పందన లభించింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్చార్జి పీఎస్ మునిరత్నం నాయుడు, డాక్టర్ సురేష్, జనసేన, బీజేపీ నాయకులు పలువురు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు

Related Posts