YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి ముఖ్యమంత్రి కేసిఅర్ హర్షం

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి                ముఖ్యమంత్రి  కేసిఅర్ హర్షం
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చింది. బుదవారం  ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీఏసీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీఏసీ అనుమతులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.సీడబ్ల్యూసీ నుంచి అన్ని అనుమతులు పొందిన ఏకైక భారీ ప్రాజెక్టుగా కాళేశ్వరం రికార్డు నెలకొల్పింది. ఒక నెలలోపే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి, రెండో దశ అటవీ అనుమతులు సాధించింది. అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ క్లియరెన్స్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హైడ్రాలజీ అనుమతుల తర్వాత పర్యావరణ అనుమతులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఏడాదిలోపు పర్యావరణ అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్న విషయం విదితమే. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా దక్షిణ తెలంగాణకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇలా పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.

Related Posts