YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహిళల ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది

మహిళల ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది

కరీంనగర్
రామడుగు మండలం వెధిరలో శుక్రవారం సభకు హాజరు మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని,  బాగుంటేనే ఆ ఇల్లు బాగుంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం రామడుగు మండలం వెదిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శుక్రవారం సభకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం సభను మహిళలంతా వినియోగించుకోవాలని, ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు. గర్భిణీలు, మహిళలు ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యలపై చర్చించే అవకాశం ఉంటుందని తెలిపారు.కష్ట సుఖాలను ఒకరికొకరు చెప్పుకునే అవకాశం ఉందని, దీంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం సభకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, వైద్యులు, మిగతా సిబ్బంది అందరూ హాజరవుతారని చెప్పారు. మహిళలు ప్రతిరోజు పోషకాహారాన్ని తీసుకోవాలని, ప్రతి నెలకు ఒకసారి ప్రభుత్వాసుపత్రు లకు వెళ్లి చెక్ అప్ చేయించుకో వాలని సూచించారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యంగా ఉండవద్దని, మహిళలు బాగుంటేనే ఆ ఇల్లు చక్కగా ఉంటుందని పేర్కొన్నారు.మహిళలకు అన్ని వైద్య పరీక్షల నిర్వహించాలి..
ఆరోగ్య మహిళ కార్యక్రమం కింద ప్రతి మంగళవారం ఆరోగ్య కేంద్రాల్లో మహిళలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, మహిళలందరూ కవర్ అయ్యేలా చూడాలని సూచించారు. బీపీ, షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్, తదితర వైద్య పరీక్షలు లతోపాటు అవసరమైన స్కానింగ్ లు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో వీటిని ఉచితంగానే చేస్తారని చెప్పారు. అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం ప్రవేట్ కు దీటుగా ప్రభుత్వాసుపత్రిల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని, వీటిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ పెరిగేందుకు మంచి పోషకాహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. ప్రతి విషయంపై ఎక్కువగా ఆలోచిస్తే లేనిపోని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో  అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఆర్డిఓ శ్రీధర్, బీసీడీవో అనిల్ ప్రకాష్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, తహసిల్దార్ భాస్కర్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts