YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

స్టీల్ ప్లాంటును కేంద్రం ఆదుకోవాలి

స్టీల్ ప్లాంటును కేంద్రం ఆదుకోవాలి

గాజువాక
 విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
10, 000 వేల  కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి వెంటిలేటర్ మీద ఉన్న స్టీల్ ప్లాంట్ కర్మకారాన్ని కాపాడాలని     సొంత గనులు  కేటాయించి, సేల్ లో  కలపాలని కార్మికులు డిమాండ్ చేశారు..  ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని అన్నారు. 620 కోట్లు ఎఫ్ ఎక్స్ ద్వారా తీసుకోమనడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు.  కూటమి  ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ను అన్ని విధాల  కాపాడాలి.  స్టీల్ మినిట్స్ వచ్చి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని తెలిపారని.., దానిని కాపాడవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దే.  స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నిస్ 3 లో ఒకటి ఆగిపోయి రెండున్నర సంవత్సరాలు అవుతుంది.  వర్కింగ్ క్యాపిటల్ లేక  60% మాత్రమే ప్లాంట్లో పనిచేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు నీరుకొండ రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, ఐ ఎన్ టి యు సి కార్మికులు పాల్గొన్నారు

Related Posts