అన్నీరకాల సౌకర్యాలు కల్పిస్తున్నా పేదల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు ఎ ందుకు రావడం లేదని విద్యావిధానంలో లోపం ఎ క్కడ ఉన్నదో ప్రతీ ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకుని లోపాన్ని నిరోధించాలని జిల్లా కలెక్టరు డా. కాటంనేని భాస్కర్ చెప్పారు. నవనిర్మాణదీక్షలో భాగంగా స్ధానిక కలెక్టరు కార్యాలయంలో బుధవారం విద్యాప్రగతితీరుపై చర్చాగోష్టిని ఆయన ప్రారంభించారు. అపార అనుభవం గల ఉపాధ్యాయులుతోపాటు 10వ తరగతి వరకూ భోజనంతోపాటు పుస్తకాలు, యూనిఫారం, స్కాలర్‌షిప్‌లు వంటి ఎ న్నో మౌలిక వసతులు కల్పిస్తున్నా ప్రభుత్వ స్కూల్స్‌పై ప్రజల్లో నమ్మకం ఎ ందుకు పెరగడం లేదని కలెక్టరు ప్రశ్నించారు. పై#్రవేట్ స్కూల్స్‌లో విపరీతమైన ఫీజులు, బుక్స్‌కు 7 వేలు, యూనిఫారంకు 4 వేలు వసూలు చేస్తున్నా పేదవర్గాల పిల్లలు పై#్రవేట్ పాఠశాలల వైపే ఎ ందుకు మొగ్గు చూపుతున్నారో ఉపాధ్యాయలోకం ఆత్మపరిశీలన చేసుకోవాలని, తల్లిదండ్రులుకు పైసా ఖర్చులేకుండా ఆధునిక విద్యను ఉచితంగా అందిస్తున్నామని చెబుతున్నా రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని కలెక్టరు ఆవేదన వ్యక్తం చేసారు. 8వ తరగతి చదివే విద్యార్ధిని 3వ తరగతి పాఠాలు చెప్పమంటే చెప్పలేని స్ధితిలో ఉన్నారంటే ప్రాధమిక విద్య అమలులో ఏదైనా లోపం ఉన్నదా? ఎ ందువల్ల పై#్రవేట్ స్కూల్స్‌పై మక్కువు ఎ క్కువు చూపుతున్నారో విద్యాశాఖ అందరితో చర్చించి లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే పశ్చిమ విద్యావ్యవస్ధ భవిష్యత్తులో మరింత పటిష్టవంతం అవుతుందని డా. భాస్కర్ చెప్పారు. ప్రాధమిక విద్యా పునాదులే పటిష్టంగా లేకపోతే విద్యార్ధి భవిష్యత్తు మిథ్యగా మారుతుందని కనుక ప్రాధమిక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పది ఏళ్ల లోపు చిన్నారులకు నాణ్యమైన విద్యాపునాదులు నిర్మిస్తే భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారని అటువంటి ప్రాధ మికవిద్యలో ఏమైనా మార్పులు చేయాలా? విద్యాభోధనలో ఆలోచనా శక్తిని పెంచే తగు శిక్షణ ఇవ్వాలా? అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేయాలని, నాణ్యమైన విద్యావిధానాన్ని అమలు చేసి ప్రాధమిక విద్యను పటిష్టవంతం చేయాలని డా. భాస్కర్ సూచించారు. అంగన్‌వాడీ నుండి చిన్నారులను పాఠశాలలకు మళ్లించే ముందు ప్లేస్కూలు విద్యను పటిష్టంగా అంగన్‌వాడీలో అమలు చేయాలని, ఇంగ్లీష్ మీడియం విధానాన్ని కూడా చిన్ననాటి నుండి అమలు చేయాలని విద్యావిధానం సక్రమంగా ఉంటే ప్రగతి సాధ్యపడుతుందని, చిన్నప్పటి నుండే వృత్తివిద్యాకోర్స్‌లు అమలు చేయాలని దానివలన స్వయం ఉపాధితో జీవితాన్ని మరింత తీర్చిదిద్దుకోగలుగుతారని ఆయన చెప్పారు. విద్యావ్యవస్ధలో మార్పురానంతవరకూ పునాదిలేని భవనంలా గమ్యంలేని జీవనం అవుతుందని అక్షర జ్ఞానం లేకపోతే భవిష్యత్తు అంధకారమే అన్న వాస్తవాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి క్షేత్రస్ధాయిలో అంగన్‌వాడీ, విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్నవయస్సులోనే అమలు చేస్తే భవిష్యత్తులో నైపుణ్యంతోకూడిన విద్యను పెంపొందించుకోగలుగుతారని అందుకే పాఠశాలల్లో డిజిటల్ లిటరసీ విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని అన్నీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ విద్యావిధానాన్ని చిన్నారులకు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో విజ్ఞానం ఉన్నవారికే అధికారం దక్కుతుందని ఎ వరైతే ఉన్నత విద్యలో ప్రతిభ చాటుకుంటారో వారికే అన్నీరకాల ఉద్యోగ అవకాశాలు కాళ్ల దగ్గరకే వస్తాయని కలెక్టరు చెప్పారు.