YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైల్వేకు భారీగా నిధులు

రైల్వేకు భారీగా నిధులు

హైదరాబాద్, జూలై 26
గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం రైల్వేల పరంగా గణనీయమైన వృద్ధిని సాధిస్తూ వస్తోన్న విషయం మనందరికీ తెలిసిందే. బడ్జెట్ కేటాయింపులు మొదలుకొని, నూతన రైల్వేట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, నూతన రైల్వేస్టేషన్ల ఏర్పాటు, సిద్ధిపేట,మెదక్ నూతన రైల్వే లైన్ల ప్రారంభం, చర్లపల్లి నూతన టెర్మినల్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచి రాష్ట్రంలో రైల్వేలు పురోగతి సాధించడంలో కీలకమైన పాత్రను పోషించింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేకమైన శ్రద్ధకు కొనసాగింపుగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా రైల్వేల అభివృద్ధికి రూ. 5,336 కోట్ల నిధులు కేటాయించింది. ఈ నిధులు 2014-15 బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే దాదాపు 21 రెట్లు ఎక్కువ. అదే 2009-14 మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు కేటాయింపులతో పోలిస్తే 6 రెట్ల కంటే ఎక్కువ. తెలంగాణ రాష్ట్రానికి పెద్దమొత్తంలో నిధులను కేటాయించడమే కాకుండా అంతే రీతిలో రాష్ట్రంలో నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణాన్ని కూడా చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 32,946 కోట్ల విలువైన నూతన రైల్వే ట్రాక్ ల ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. గతంలో 2009-14 మధ్యన సంవత్సరానికి సగటున 17 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరగగా, గత 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి సగటున 65 కి. మీ. ల నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం జరిగింది. వీటితో పాటుగా అనేక నూతన రైల్వే మార్గాలకు సంబంధించిన, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ ప్రాజెక్టులు ఫైనల్ లొకేషన్ సర్వేను జరుపుకుంటున్నాయి. నూతన రైల్వే ట్రాక్ లను నిర్మించడమే కాకుండా, నిర్మించిన రైల్వే ట్రాక్ ల విద్యుద్ధీకరణపై కూడా రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధను కనబరచింది. తద్వారా నేడు తెలంగాణ రాష్ట్రంలో 100% రైల్వేల విద్యుద్ధీకరణ సాధ్యమయ్యింది. నూతన రైల్వే ట్రాక్ ల నిర్మాణం, విద్యుద్ధీకరణతో పాటుగా రక్షణ పరంగా కూడా రైల్వేశాఖ గట్టి చర్యలు చేపట్టింది. గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 437 రైల్ ఓవర్ బ్రిడ్జ్ & రైల్ అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం జరిగింది. వీటితోపాటుగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించనున్నారు. వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు జరగడమే కాకుండా ఆయా రైల్వేస్టేషన్లలో పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయా రైల్వేస్టేషన్ల వివరాలు:అదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్డు, గద్వాల, హఫీజ్ పేట, హైటెక్ సిటీ, హుప్పు గూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగామ, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట్ జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మలక్ పేట, మల్కాజ్ గిరి, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సికింద్రాబాద్, షాద్ నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగుళాంబ, తాండూర్, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్ పుర, జహీరాబాద్ రైల్వేస్టేషన్లువీటితోపాటుగా హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడానికి చర్లపల్లిలో నిర్మిస్తున్న నూతన టెర్మినల్ పనులు 99% పూర్తి అయ్యాయి. త్వరలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం కానుంది. అలాగే, రూ.715 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని తలపెట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి.

Related Posts