YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హర్షకుమార్.. దారెటు

హర్షకుమార్.. దారెటు

కాకినాడ, జూలై 27 
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన హర్షకుమార్ ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. కాంగ్రెస్ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కూడా పోటీ చేయలేదు. అన్ని పార్టీల నేతలనూ విమర్శిస్తున్నారు. అమలాపురం నుంచి రెండు సార్లు హర్షకుమార్ ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. 2019లో వైసీపీలో చేరినా టిక్కెట్ రాకపోవడంతో బయటకు వచ్చారు.విశాఖలో పోర్ట్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసు విచారణ ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రశ్నించారు. రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కీలక అంశాలపై సంచలన ఆరోపణలు చేశారు.  ప్రధాని మోదీకి విశాఖ డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నట్లు తనకు అనుమానం ఉందన్నారు. కేసు దర్యాప్తును సిబిఐ ఎందుకు ఆపివేసిందని ఆయన ప్రశ్నించారు.  విశాఖ డ్రగ్స్ కేసులో పార్లమెంట్ లో వివరణ ఇవ్వాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.
పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిందని హర్షకుమార్ తెలిపారు. పోలవరంలో ఇప్పటివరకు కొట్టింది అంతా వృధా అయ్యిందన్నారు.  పోలవరం ప్రాజెక్టు మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుందని..  డయాఫ్రమ్ వాల్ సరిగ్గా కట్టకపోతే గోదావరి జిల్లాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  పోలవరం ప్రాజెక్టులో సింగిల్ కాదు డబుల్ డయాఫ్రమ్ వాల్ కట్టాలన్నారు.  టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టును  ఏటీఎంలా వాడుకున్నాయని మండిపడ్డారు.  పోలవరం ఇలా అవ్వడానికి  ప్రథమ దోషి చంద్రబాబు, రెండో దోషి జగన్ అన్నారు.  పోలవరంలో అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వెయ్యాలని డిమాండ్ చేశారు.  లేకపోతే తానే పోలవరంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తానునని స్పష్టం చేశారు. బడ్జెట్ లో అమరావతికి 15వేల కోట్లు ఎలా ఇస్తారో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పలేదని హర్షకుమార్ తెలిపారు. గ్రాంట్ గా ఇస్తారో .. లోన్ గా ఇస్తారో ఇంకా చెప్పలేదన్నారు. ల కేంద్రంలో బలం ఉండి కూడా చంద్రబాబు, పవన్ లు ప్రత్యేక హోదా సాధించలేకపోవడం సిగ్గుచేటన్నారు.  చంద్రబాబు అసెంబ్లీలో హెడ్మాస్టర్ లా వ్యవహరిస్తున్నారని..  అసెంబ్లీలో సభ్యులు ఆయన నిలబడాలంటే నిల్చుంటునతన్నారు, కూర్చోమంటే కూర్చుంటున్నారన్నారు.  ఢిల్లీలో జగన్ సినిమా నటుడిలా యాక్ట్ చేశారన.ి. ల ఒక రౌడీషీటర్ హత్యకు ఢిల్లీ వెళ్లి జగన్ నాటకాలు ఆడారని మండిపడ్డారు.  జగన్ హయాంలో అప్రజాస్వామ్య పాలన  గతంలో ఏ ప్రభుత్వంలో జరగలేదన్నారు.

Related Posts