YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మావోయిస్టుల కోసం జల్లెడ

మావోయిస్టుల కోసం జల్లెడ

హైదరాబాద్, జూలై 27,
ఒకవైపు ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతుంటే.. మరోవైపు తెలంగాణ చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే జూలై 28 నుండి మావోయిస్టు పార్టీ అమర వీరుల సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. అడవులను జల్లెడ పడుతూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పిలుపు నిచ్చింది..జూలై 28 నుండి ఆగష్టు 3వ తేదీ వరకు జరుగనున్న మావోయిస్టు పార్టీ అమర వీరుల సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఒకవైపు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుంటే, మరో వైపు మావోయిస్టులు లేఖలు విడుదల చేసి కాకరేపుతున్నారు. దీంతో తెలంగాణ – చత్తిస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది.ప్రతియేట నిర్వహించే కార్యక్రమంలోనే భాగంగా జూలై 28 నుండి ఆగష్టు 3 వరకు జరిగే మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని, పీడిత ప్రజలంతా ఈ ఉత్సవాలలో భాగస్వామ్యం కావాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ నీవురుగప్పిన నిప్పులా మారింది.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గోదావరి తీరం వెంట పోలీసుల నిఘా ముమ్మరం చేశారు. ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, ములుగు లో ముమ్మరం తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు కాళేశ్వరం అంతర్ రాష్ట్ర వంతెన వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.. గోదావరిలో ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న వాహనాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాహనాలను స్థానిక పోలీస్ స్టేషనులకు తరలించారు.ఒకవైపు పోలీసుల తనిఖీలు, హై అలెర్ట్ కొనసాగుతుంటే మరోవైపు మావోయిస్టులు లేఖలు విడుదల చేసి సవాల్ విసిరారు.. మావోయిస్టు పార్టీ అమర వీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో ఉత్సవాల నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ టెన్షన్ కొనసాగుతోంది.

Related Posts