YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కోకాపేట మెట్రో రెట్టింపు వ్యయం

కోకాపేట మెట్రో రెట్టింపు వ్యయం

హైదరాబాద్, జూలై 27,
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణం ప్రతిపాదనలను ప్రభుత్వం సవరించింది. పాత వాటి స్థానంలొ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మునుపటి ప్రాతిపాదనల్లో భాగంగా 5 కారిడార్లలో 70 కిలో మీటర్ల మేర నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజా సవరింపుతో అది 78.4 కిలో మీటర్లకు చేరుకుంది. అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 24, 042 కోట్లకు చేరుకుంది.హైదరాబాద్ మెట్రో రెండో దశ దూరం, అంచనా వ్యాయాలు పెరిగాయి. రాయదుర్గం నుంచి విప్రో కూడలి , ఫైనాన్షయల్ డిస్ట్రిక్‌లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మార్గాన్ని మొదట ప్రాతిపాదించారు. దీన్ని కోకాపేట్ నియోపోలీస్ వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కిలో మీటర్లకు పైగా దూరం పెరిగింది. ఈ కారణంగా అంచనాలు భారీగా పెరిగాయి. మెట్రో డిపో కూడా అక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల క్రిందట పరిశీలించారు.మరో వైపు కంగా 10 వేల కోట్ల రూపాయలను కేటాయించడంతో నగరవాసులు హ్యాపీగా ఫీలవుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ స్థాయిలో నిధులు ఎప్పుడూ కేటాయించలేదన్నది ప్రజల మాట.ఇందుకు కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ సిటీలో ప్రతీ ఏడాది జనాభా పెరుగుతోంది అందుకు తగ్గట్టుగా సదుపాయాలు లేవన్నది పాలకపక్షం మాట. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించామని చెబుతోంది. వచ్చే ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. నిధుల కేటాయింపు అధికార పార్టీ కలిసి వస్తుందన్నది నేతల మాట.రెండోవైపు తెలంగాణలో జనాభా పెరుగుదలను పరిశీలిస్తే.. మిగతా జిల్లాల కంటే హైదరాబాద్ సిటీలో జనాభా క్రమంగా పెరుగుతోంది. 2026లో నియోజక వర్గాల పునర్విభజన ఉంది. ప్రస్తుతమున్న 119 సీట్ల నుంచి 150కి పైగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. సీట్ల పెంపు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుందని సమాచారం. అది జరిగితే పాలక పక్షానికి తిరుగులేదని అంటున్నారు.గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి కంటే బాగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు చెబుతున్నా రు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాలకపక్షం భారీ ఎత్తున నిధులను బడ్జెట్‌లో కేటాయించినట్టు చెబుతున్నారు. రాబోయే మూడేళ్లు ఈ విధంగా కేటాయింపులు ఉంటాయన్నది అధికారులు చెబుతున్నమాట. రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు మహర్దశ పట్టడం ఖాయం.

Related Posts