YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందుబాటులోకి మరో 10 వేల సీట్లు

అందుబాటులోకి మరో 10 వేల సీట్లు

హైదరాబాద్, జూలై 27,
ఇంజినీరింగ్ చేసే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కాగా, 27, 28 తేదీలలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో పెంచనున్న సీట్లు నేడు లేదా రేపు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రోజుల్లోనే కొత్త సీట్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.రాష్ట్రంలో డిమాండ్ లేని బ్రాంచీల స్థానలంలో సీఎస్ఈ, ఇతర బ్రాంచీల ద్వారా సుమారు 7వేల సీట్లతో అదనంగా 20వేల 500 కొత్త సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొత్త సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందకు ఏఐసీటీఈ సైతం ఆమోదం తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత కౌన్సెలింగ్ లో సుమారు 2,600 సీట్లకు అనుమతి ఇచ్చింది. అయితే రెండో విడత కౌన్సెలింగ్ కు సుమారు 9వేల వరకు మంజూరు చేసేందుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కసరత్తు పూర్తి చేశారు. దాదాపు సగం సీట్లకు కోత విధించిందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి.తొలి విడత కౌన్సెలింగ్ లో 75,200 మందికి ఇంజినీరింగ్ సీట్లు లభించాయి. వీరంతా ఇప్పటికే ట్యూషన్ ఫీజు చెల్లంచడంతోపాటు ఆన్ లైన్ లో సెల్ప్ రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే గడువు ముగిసింది. అయితే కేవలం 55వేల మంది విద్యార్థులు మాత్రమే రిపోర్టు చేయగా.. మిగతా 20వేల మంది విద్యార్థులు రిపోర్టు చేయలేదు. ఇందులో చాలామంది మేనేజ్ మెంట్ కోటాలో చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

Related Posts