YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాధురీ దీక్షిత్‌కు బుక్‌లెట్ అందజేస్తున్న అమిత్ షా

మాధురీ దీక్షిత్‌కు బుక్‌లెట్ అందజేస్తున్న అమిత్ షా
2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమాలు, సాధించిన విజయాలతో రూపొందించిన బుక్‌లెట్లను అందజేస్తున్నారు. పార్టీ శ్రేణులను 2019 ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ.. అమిత్ షా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. రిటైర్డ్ ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ నివాసం నుంచి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తరవాత లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్‌, క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ తదితరులను కలిశారు.  ఈ క్యాంపెయిన్‌లో భాగంగా అమిత్ షా 50 మంది మేధావులను (ఒపీనియన్ మేకర్స్‌) కలవనున్నారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 4000 మంది పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు లక్ష మంది ప్రముఖ పౌరులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాల గురించి వివరించాలనేది లక్ష్యం. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్‌ను కూడా అమిత్ షా త్వరలోనే కలుసుకోబోతున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంచి జోరుమీదున్నారు. ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ కార్యక్రమంలో భాగంగా వరసపెట్టి ప్రముఖులను కలుస్తున్న కాషాయి నేత  ముంబై చేరుకున్నారు. మొదటిగా బాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్‌‌ను కలిశారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అత్యుత్తమ కార్యక్రమాలను వివరించే పుస్తకాన్ని మాధురి, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్‌కు అందజేశారు. అమిత్ షా వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. స్వయంగా మాధురి ఇంటికి వెళ్లి కలిసిన అమిత్ షా.. వారితో కాసేపు ముచ్చటించారు. అయితే ఇప్పుడు అమిత్ షా ఎవరిని కలవబోతున్నారనేది ఆసక్తిగా మారింది. ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చిన శివసేనను బుజ్జగించేందుకు అమిత్ షా సన్నద్ధమవుతున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేను కూడా కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఉద్ధవ్ థాకరేను అమిత్ షా కలిసి ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ పుస్తకం అందజేశారు అయితే ఇది నిజమయ్యేలానే కనిపిస్తోంది. 

Related Posts