హైదరాబాద్
ఏపీ ఆర్థిక పరిస్థితి పైన చంద్రబాబు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆర్థికంగా ఉన్న లోపాలు ఇవి.. మేము వీటిని సరిదిద్దుతాం అని ఉండేలా వైట్ పేపర్ ఉండాలి. ఇది శ్వేత పత్రమా.. లేదా సాకు పత్రమాఅని ఏపీ మాజీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. శనివారంఅయన మీడియాతో మాట్లాడారు. సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు.. మొట్ట మొదటి ఓవర్ లోనే డక్ అవుట్ అయ్యారు. రెండు లక్షల నలభై వేల కోట్లు మీకు ఆదాయం ఉంది. అపారమైన తెలివి మీకు ఉందనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది. ఎప్పుడు అమ్మ ఒడి, రైతు భరోసా, పెన్షన్, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని ప్రజలు కాచుకుని ఉన్నారని అన్నారు. మీలు అమలు చేయకుండా సూపర్ సిక్స్ ను డక్ అవుట్ చేశారని అన్నారు. గతంలో పర్ క్యాప్టా 18వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 7 వ స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. లిక్కర్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. మీరు గతంలో సిండికేట్ చేసుకుని ఎక్కువ రేటుకు లిక్కర్ అమ్మేవారు. సిండికేట్ కు ఎక్కువగా అమ్ముతున్న దాన్ని మేము ప్రభుత్వానికి మళ్లించాం. మా ప్రభుత్వం వచ్చాక ఏఆర్ఈటి అనేది పెట్టి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కు ఫండ్ అందించాం. వాటిని నాలుగు పథకాల అమలుకు వినియోగించామని అన్నారు.మేము చేస్తే అప్పు.. తెలుగుదేశం చేస్తే నిప్పు. జూన్ నుంచి మీరు ఎన్ని అప్పులు తీసుకున్నారో కూడా చెప్పండి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులను రాయండి. అప్పులు ఇష్టానుసారంగాతేవడానికి వీలు ఉండదు.. ఒక నిబంధన అనేది ఉంటుందని అన్నారు.