తిరుపతి, జూలై 31,
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ వల బిగుస్తుంది. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ప్రధాన లక్ష్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. ఆయనపై కేసులు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాన శత్రువు జగన్ అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం పొలిటికల్ గేమ్ లో తొలి వికెట్ తీసి బాధ రుచి చూపించాలన్న ఉద్దేశ్యంతో పాలకపక్షం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకు అనేక అవకాశాలు కూడా కలసి వస్తున్నాయి. పెద్దిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోలిగితే మిగిలిన వైసీపీ నేతల నోళ్లు ఆటోమేటిక్ గా మూతపడిపోతాయన్న ఆలోచనలో పాలకపక్షంలో స్పష్టంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో... అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూళిపాళ్ల రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి.. నోరున్న నేతలందరినీ వివిధ కేసుల్లో ఇరికించారన్న ఆరోపణలు వినిపించాయి. వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో మగ్గిపోయేలా చేశారని టీడీపీ నేతలు పదే పదే ఆరోపించేవారు. అప్పట్లో అదే టీడీపీకి ప్రధాన ప్రచారంగా మారింది. సీనియర్ నేతలను లోపల వేస్తే మిగిలిన నేతలు దారిలోకి వస్తారన్న ఏకైక లక్ష్యంతోనే నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం తమ లీడర్లపై అక్రమ కేసులను బనాయించి జైలు పాలు చేసిందన్న ఆరోపణలు చేశారు. చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పై బయటకు వచ్చారు. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా వదలలేదు. ఆయనపై స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు నమోదు చేసి రాజమండ్రి జైలులో 52 రోజులు ఉంచి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. న్నిరోజులంటే? రాజకీయ వైరమే కాకుండా... ఇప్పుడు అదే ఫార్ములాను చంద్రబాబు ప్రభుత్వం కూడా వైసీపీ నేతలపై ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కు అత్యంత ఆప్తుడు మాత్రమే కాదు. చంద్రబాబుకు ప్రధాన శత్రువు. అంతే కాదు దశాబ్దాల కాలం నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ కక్షలు దిగకపోయినప్పటికీ ఈసారి మాత్రం పెద్దిరెడ్డి చేసిన అక్రమాలను వెలికి తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఖచ్చితమైన అభిప్రాయంలో ఉంది. అందుకోసమే ఫస్ట్ ప్రయారిటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయ్యారు. ఆయన చుట్టూ ఇప్పటికే అనేక కేసులు వేలాడుతున్నాయి. ఇంకా నమోదు కాకపోయినప్పటికీ విచారణ జరుగుతుండటంతో త్వరలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కేసులు నమోదు చేయడానికి సర్వం సిద్ధమయినట్లు సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగి కీలక కంప్యూటర్లు, దస్త్రాలన్నీ దగ్గమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆర్డీవో హరి ప్రసాద్‌తో పాటు 37 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. కాల్‌డేటాపైనా ఆరాతీశారు. చుక్కల భూములు, 22ఏ ల్యాండ్స్, రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్‌కి సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా? లేదా? అన్నది తేల్చే పనిలో పడ్డారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ముగ్గురిపై సస్పెన్షన్ వేటు పడింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ఇప్పటికే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఈ కేసులో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులతో పాటు మాజీ మంత్రి పెద్ది రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అనుచరులను పోలీసులు దశల వారీగా విచారిస్తున్నారు. త్వరలోనే దీనిపై కేసులు నమోదు చేసి లోతైన విచారణ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ ఇంట్లో సోదాలను నిర్వహించిన అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సో... పెద్దిరెడ్డి చుట్టూ వల బిగుసుకుంటుందని అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది.