YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన చిదంబరం

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన చిదంబరం
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం బుధవారం సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరంను ప్రశ్నించేందుకు సీబీఐ ఆయన్ను విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. చిదంబరం ఈరోజు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చిదంబరం వచ్చారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ఇచ్చిన అనుమతులలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్‌ఎక్స్‌ మీడియా మాజీ అధినేతలు పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.ఈ కేసుకు సంబంధించే మ‌నీలాండ‌రింగ్ ఆరోపణ‌లు ఎదుర్కొంటున్నందుకు గాను ఇదివ‌ర‌కే చిదంబ‌రంను ఈడీ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. అయితే జులై 10 వ‌ర‌కూ ఈ కేసులో ఆయ‌న్ను అరెస్టు చేయొద్ద‌ని ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ఊర‌ట‌నిచ్చింది. ఈ కేసులో గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ కార్తి చిదంబరంను అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి చిదంబరాన్ని జులై 3 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులోనూ చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కూడా ఆయనను జులై 10 వరకు అరెస్ట్‌ చేయొద్దని ఢిల్లీ పాటియాలా కోర్టు తీర్పు చెప్పింది. ఈ రెండు కేసుల్లోనూ సీబీఐ ఎప్పుడు పిలిస్తే అప్పుడు చిదంబరం విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 

Related Posts