మచిలీపట్నం బీచ్ కి మహర్దశ
- ఐదేళ్ల జగన్ పాలనలో పర్యాటకాన్ని పడకేయించారు
- అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి వసతులు కల్పిస్తాం
- దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా మంగినపూడి బీచ్ అభివృద్ధి చేస్తాం
-- గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
బందరుకు మణిహారంలా నిలిచే మంగినపూడి తీరాన్ని దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు పోటీగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్ తో కలిసి మంగినపూడి బీచ్ సందర్శించారు. వసతులు, రక్షణ చర్యలు గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీచ్ లో అనేక అభివృద్ధి పనులు చేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి పనుల్ని పడకేయించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేయకపోగా ఉన్న పనుల్ని కూడా నాశనం చేశారు. మట్టి అమ్ముకుని బీచ్ పరిసరాలను నాశనం చేశారు. తీర ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. కూటమి అధికారంలోకి వచ్చాక మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాలికలు రూపొందిస్తున్నాం అన్నారు. త్వరలోనే ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. అవసమైన మేరకు హోటల్స్, రిసార్ట్స్, బీచ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చడతాం. భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.