YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రైవేట్ రంగానికి దీటుగా బిఎస్ఎన్ఎల్ సేవలు

ప్రైవేట్ రంగానికి దీటుగా బిఎస్ఎన్ఎల్ సేవలు

కొత్తగూడెం, జూలై 31
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ ( బి.ఎస్.ఎన్.ఎల్) ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఏజీఎం జి. సుభాష్ కోరారు. బుధవారం కొత్తగూడెం లో ఉద్యోగులు, సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకొని బైక్ ర్యాలీని నిర్వహించి వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ కొత్తగూడెం డి.ఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు, తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సoస్థల్లో ఒక వెలుగు వెలిగి మొదటిస్థానంలో ఉన్న  బి.ఎస్.ఎన్.ఎల్  తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు.టెలికాం రంగంలోనే రారాజుగా కొనసాగి,ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్ రంగానికి ధీటుగా వినియోగదారులకు సేవలు అందిస్తుoదన్నారు.ఇటీవల ప్రైవేట్ రంగంలోని వివిధ రకాల నెట్వర్క్ సంస్థలు తమ టారీఫ్ ప్లాన్స్ ను ఒక్కసారిగా పెంచడంతో వినియోగదారుల చూపులు మరోసారి బి.ఎస్.ఎన్.ఎల్ వైపు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అన్నీ కంపెనీల కష్టమర్ దేవుళ్లను అక్షరించేలా బి.ఎస్.ఎన్.ఎల్ ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం ప్రారంభించిందని, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.ప్రస్తుతం ఇతర కంపెనీలతో పోల్చుకుంటే బి.ఎస్.ఎన్.ఎల్ ట్రారీఫ్ ధర పర్వాలేదనేలా ఉన్నాయని వినియోగదారులు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.పూర్తిస్థాయిలో సిగ్నల్స్,ఇంటర్నెట్ స్పీడ్,సర్వీస్ లు అందుబాటులో ఉండడం వినియోగదారులకు కలిసివచ్చే అంశంగా ఉందని అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.గత నెలరోజుల నుంచి భద్రాద్రి జిల్లాలో ఫ్రీ సిమ్ మేళా నిర్వహిస్తున్నామని దానికి అపూర్వ స్పందన లబిస్తుదన్నారు.
వివిధ నెట్వర్క్ నుండి పోర్ట్ అవుట్ చేసుకొని బి.ఎస్.ఎన్.ఎల్   నెట్వర్క్ లోకి వస్తున్నట్లు తెలిపారు. ఈ  మేళాలో  వినియోగ దారులకు  4జి సిమ్ కార్డును ఉచితంగా అందజేసి వారుకోరుకున్న టారీఫ్ రీఛార్జ్ కే చెల్లిపులు తీసుకుంటున్నామని తెలిపారు.బిఎస్ఎన్ఎల్ సంస్థకు పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రణాళిక బద్ధంగా, ఉన్నతాధికారుల సూచనలు మేరకు పనిచేస్తున్నామని తెలిపారు.  రాబోయే రోజుల్లో ఎఫ్.టి.టి.హెచ్, ల్యాండ్ ఫోన్ లను ప్రజలకు మరింత చేరువ చేసే పనిలో నిమగ్నమవుతున్నారని తెలిపారు.చౌక ధరలకే తమ మొబైల్ వినియోగ దారులకు 4జి సేవలను అందిస్తుందన్నారు. వినియోగ దారులు ఈ అద్భుత అవకాశాన్ని ఉపయోగించుకోవాల న్నారు.అతి తక్కువ ధరకే టారీఫ్ ప్లాన్స్ ఉన్నాయన్నారు.బి.ఎస్.ఎన్.ఎల్ లో  కేవలం రూ. 108 లకే 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్, ప్రతిరోజూ 1జి.బి  డేటా,  100 ఉచిత ఎస్.ఎమ్.ఎస్   వినియోగించుకోవచ్చు. రూ. 249 లకే 45 రోజుల పాటు అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్, ప్రతిరోజూ 2జిబి డేటా, 100 ఎస్.ఎమ్.ఎస్  ఉచితంగా పొందవచ్చు.మరెన్నో ఆఫర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ  కార్యక్రమంలో  బానోత్ సక్రు,  మదన్ గోపాల్, షకీల్, గోపి రాజేష్, అజయ్, లాలు నాయక్,  అశోక్, రామరాజు, సందీప్, గణేష్, నరేష్, అంకిత్, రమేష్, నీరజ, సైదులు, ఆఫీస్ సూపరింటెండెంట్ శివరాంజీ,  నూర్ మహమ్మద్, జైపాల్ రెడ్డి, మాన్ సింగ్, ఆశీర్వాదం, టెక్నీషియన్లు నిరంజన్, రాంకుమార్, నారాయణ, వెంకటేశ్వర్లు, సుజాత, సీత, బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు రమేష్, శ్రీనివాస్, మజీద్, విక్టర్, డేనియల్, జాన్సన్, ఫ్రాంచైజీస్ మురళి, బాలు, పాషా, యాదగిరి,బాలాజీ,నాగరాజు, ప్రదీప్ తదితరులు పాల్గోన్నారు.

Related Posts