YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కత్తిమీద సాము... నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి అడుగులు

కత్తిమీద సాము... నామినేటెడ్ పోస్టులపై ఆచితూచి అడుగులు

విజయవాడ, ఆగస్టు 2,
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలు తమ విజయం కోసం కృషి చేసిన క్యాడర్ కు పదవులు ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించాయి.  రెండు నెలల్లోగా విడతల వారీగా పోస్టులను క్యాడర్ కు ఇచ్చేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి.  గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నానినేటెడ్ పోస్టుల భర్తీని విడతల వారీగా చేపట్టాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, పురందేశ్వరి  ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు.  ఈ క్రమంలోనే మూడు పార్టీల్లోనూ పార్టీ కోసం పని చేసిన నేతలు, కార్యకర్తల సమాచార సేకరణ దాదాపుగా పూర్తి చేశారు. కూటమలో భాగంగా మూడు పార్టీల్లోని కీలక నేతలు పోటీ చేయలేకపోయారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.    ఎన్నికల్లో తక్కువ సీట్లే ఇచ్చినా సర్దుకుపోయామని.. నామినేటెడ్ పోస్టుల్లో కచ్చితంగా ప్రయార్టీ లభిస్తుందని జనసేన నేతలు ఆశ పడుతున్నారు.  తమకు కూడా ప్రాధాన్యత ఉంటుందని బీజేపీ  అంచనాలో ఉంది.   కూటమి పార్టీలకు నామినేటెడ్‌ పోస్టుల పంపిణీకి ఫార్ములాను రూపొందించారు.  టిడిపి ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 30 శాతం జనసేన, 10 శాతం బిజెపి కార్యకర్తలకు, బిజెపి ఎమ్మెల్యే ఉన్న స్థానాల్లో టిడిపికి 50 శాతం, బిజెపి, జన సేనలకు 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నరు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న  చోట్ల అరవై శాతం టీడీపీకి , ముఫ్పై శాతం జనసేనకు, పది శాతం బీజేపీకి ఇవ్వాలనుకుంటున్నారు.మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ, జనసేన పార్టీల్లో చాలా మందే ఉన్నారు. వీరిలో పలువురు నామినేట్ పోస్టుల కోసం పోటీపడుతున్నారు.  వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు  వివిధ శాఖల్లో సుమారు 95 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.  2014-19 టిడిపి అధికారంలో ఉన్న సమయంలో బిజెపికి, జనసేనకు ఎలాంటి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు ఇవ్వలేదు. జనసేన కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఈ ప్రస్తావన కూడా రాలేదు. ఇప్పుడు కూటమిలో ఎవరికి ఏం కేటాయిస్తారనేది వేచిచూడాల్సి ఉంది. టిడిపిలో నామినేటెడ్‌ పోస్టులు కోరుతున్న వారిలో ఆశావహులు భారీగానే ఉన్నారు.పార్టీ విజయం కోసం పని చేసిన వారికే మాత్రమే పదవులు ఇస్తారు.  త్యాగం చేసిన మాజీ మంత్రులు, సీనియర్‌ నాయకులు కూడా నామినేటెడ్‌ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టిడిపి కార్యాలయంలో ఆశావహులు దరఖాస్తులు ఇచ్చారు.   ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి ఎవరు ఎలా పనిచేశారన్న అంశం ప్రాతిపదికగా అంతర్గతంగా ర్యాంకులు  ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పదవుల్లో అవకాశం ఇవ్వాలని  నిర్ణయించారు.  ఆశావహుల నుంచి వచ్చిన దరఖాస్తులను తొలుత టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్క్రూటినీ చేస్తారని టిడిపి నాయకులు చెబుతున్నారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వంలో  నామినేటెడ్ పదవుల పంపకం అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వివాదం రాకుండా చూసుకోవాలని మూడు పార్టీల నేతలు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

Related Posts