YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితం ఎస్సీ వర్గీకరణ....

మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితం ఎస్సీ వర్గీకరణ....

ఖమ్మం  
జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఆ ధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి , వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంది అని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు . వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ జాతీయ అధ్యక్షులు వేముల బలరామాదిగ రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ నాయకత్వంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఆచరంలో రాష్ట్రవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు . గత 30 సంవత్సరాలుగా యావత్ మాదిగ జాతి చేసిన ఉద్యమానికి ఫలితం . అలాగే మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కలిపించిందన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ శ్యామల మాదిగ , ప్రచార కార్యదర్శి కనకపుడి వీరస్వామి మాదిగ , మధిర నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకయ్య బాబు మాదిగ , ఆలేరు నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదిగ గద్దల చంద్రయ్య రిటైర్డ్ ఎంపీడీవో సగ్గుర్తి వంశీ మాదిగ యువజన సంఘం నగర అధ్యక్షులు  ఆటో యూనియన్ అధ్యక్షులు అన్ని పాక  గురుమూర్తి మాదిగ , ఆటో యూనియన్ నగర అధ్యక్షులు పొట్టి వెంకటేష్ సుమన్ లక్ష్మణ్ రమేష్ , వెంకటేష్ మాదిగ  రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు

Related Posts