YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం

సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం

కమాన్ పూర్
గత 30 సంవత్సరాలుగా మాదిగ, మాదిగ ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ చేయాలనే డిమాండ్ తో అనేక ఉద్యమాలు నిర్వహించారు. అనేక ఆటుపోట్లు, కష్టనష్టాలు, కేసులు, బలిదానాలు అనేక ఉద్యమాల ఫలితంగా నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ న్యాయ సమ్మతమైనదే అని తీర్పు ఇవ్వడం పట్ల దేశంలోని  ప్రజలు మొత్తము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ తీర్పును బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తుంది. అంబేద్కర్ కలలుగన్న సమాజం స్థాపనకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఈ తీర్పు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నది. మాన్యశ్రీ కాన్సిరాం కలలుగన్న దళిత జాతి అభివృద్ధికి ఈ తీర్పు ఎంతగానో దోహదపడుతుంది. ఈ పోరాటం వెనుక గౌరవ శ్రీ దళిత జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారు ఎంతగానో శ్రమించారు. 30 సంవత్సరాల పాటు అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ విజయం వెనక ప్రధాన పాత్ర ఉన్నది అని అంటే అది   మందకృష్ణ మాదిగ దే అని చెప్పవచ్చు అని పేర్కొన్నారు.
నిజంగాఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పుకు బీజేపీకి ఏ సంబంధం లేదు. బీజేపీ ఫుల్ మెజారిటీ ఉన్నా పార్లమెంటులో బిల్లు పెట్టి ఆర్టికల్ 341కి సవరణ చేయలేదు.
సుప్రీంకోర్టు న్యాయవాదులు కపిల్ సిబల్, సల్మాన్ ఖుర్శిద్ లు వర్గీకరణకు మద్దతుగా వాదనలు చేశారు. ఈ తీర్పు రావడంలో పంజాబ్ ప్రభుత్వంతో పాటూ అది కూడా గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సిబల్, ఖుర్శిద్ ల పాత్ర ఉన్నది.
ఈ కేసులో ప్రధాన పాత్ర పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానిది. ఈ కేసుకూ బీజేపీకి ఏ సంబంధం లేదు.చంద్రబాబు కేసులో వాదనలు వినిపించిన సిద్దార్థ్ లుత్రా ఈ కేసులోనూ వర్గీకరణకు అనుకూలంగా వాదించాడు. సుప్రీం తీర్పును అన్ని రాష్ట్రాలు త్వరితగతిన అమలుచేసి ఎస్సీ వర్గీకరణను కొనసాగించాలని దళిత జాతి అభివృద్ధికి ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్సీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Related Posts