YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మొక్కలతో ఆహ్లాదం

మొక్కలతో ఆహ్లాదం
పచ్చని మొక్కలు, చెట్లు, పూలమొక్కలు ఇంటి అందాన్ని పెంచుతాయి.  ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుతాయి. అందుకే నగర వారసులు తమ ఇళ్లలో మొక్కల పెంపకానికే ఆసక్తి చూపుతున్నారు. నర్సరీలు నిర్వహించే నిపుణుల సలహాలను జాగ్రత్తలను పాటిస్తూ, అందంతోపాటు ఆహ్లాదాన్ని సొంతం చేసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు. నగరవాసుల ఆసక్తిని గమనించిన పలువురు పట్టణాల్లోనే నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరైతే ముఖ్యప్రాంతాల రోడ్లుపక్కన నిర్వహిస్తూ మంచి ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఇక్కడున్న మొక్కల పచ్చదనాన్ని చూసి ముచ్చటపడుతున్న నగరవాసులు వాటిని కొనుగోలు చేయడానికి పోటీపడుతున్నారు. దీంతో నర్సరీల వద్ద అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. అందుకే వర్షాలు మొదలయ్యే లోపు ఇంటిలో పచ్చని మొక్కలు పెంచుకోవాలనుకునే వారికి నర్సరీ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు ప్లాస్టిక్‌ కుండీలు కన్నా మట్టి, సిమెంట్‌తో చేసిన కుండీలు మంచిదని అంటున్నారు. ఇంటిలో పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే ఇంటిలో పెంచే మొక్కను జాగ్రత్తగా చూసుకోవాలి. తేమను గమనిస్తూ రోజుకొకసారి నీటిని పోయాలి. చీడపట్టిన్నప్పుడు వర్మి కంపోస్ట్‌ ఎరువును తప్పనిసరిగా వాడాలి. అప్పుడే మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతాయి.
 
ఇక కుండీల్లో మొక్కలు నాటే ముందు ఐదు భాగాల ఎర్రమట్టి, మూడు భాగాల పసువుల ఎరువు, లేదా వర్మి కంపోస్ట్‌లో కొద్దిగా గెమాగ్జిన్‌ పౌడర్‌, బొగ్గు, ఎండుఆకులు, రంపపు పొట్టు, సూపర్‌ పాస్పేట్‌ కలిపి ఈ మిశ్రమాన్ని కుండీల్లో నింపి మొక్కలు నాటాలి. కొన్ని రోజుల తరువాత కుండీల్లో భారీగా పెరిగిన మొక్కలను మట్టితో సహా తీసి నేలలో నాటుకోవచ్చు. మొక్కల పొదల్లో తేమను గమనించి నీరుపోస్తూ మొక్కలను రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడమేకాకుండా ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండేందుకు మొక్కలు దోహదపడతాయి. గృహాల్లో పెంచుకునే మొక్కల్లో అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి. టేబుల్‌ఫాం, రాబిక్‌, ఆర్కెఫాం, దస్తూరి, అంజీర, క్రిస్మస్‌ ట్రీ, గులాబి, లిల్లీ, అశ్వగంధ, చామంతి, పైకస్‌, నాక్సెమల్లె, తదితర మొక్కలను కుండీల్లో ఇంటి ఆవరణలో నాటుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఎంతో ఇష్టంగా ఆసక్తితో పెంచుకున్న మొక్కలను వేరే స్థలానికి తీసుకెళ్లలేం. కాబట్టి తరలించేందుకు వీలుగా ఈ మొక్కలను కుండీల్లో నాటుకుంటేనే సౌకర్యంగా ఉంటుంది. 

Related Posts