YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాఠశాలలో ఫుడ్ పాయిజన్

పాఠశాలలో ఫుడ్ పాయిజన్

నంద్యాల
నంద్యాల శివారులోని వెంకటేశ్వర గ్రామం పరిధిలోని వైకాపా నాయకునికి చెందిన ఎస్. డి.ఆర్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు.శుక్రవారం ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు వందమందికి పైగా వాంతులు చేసుకున్నట్లు సమాచారం.విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ స్కూల్ యాజమాన్యం బుకాయించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయ శాఖ మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ మహబూబ్ బేగ్,మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులతో మాట్లాడి, జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు.వంద మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అంశంపై పాఠశాల చైర్మన్ ను వివరణ కోరగా తన పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని డొంక తిరుగుడు మాటలు చెప్పడం దారుణం. డీఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా 80 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు.దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Posts