YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సైబర్ నేరాల ముఠా అరెస్టు

సైబర్ నేరాల ముఠా అరెస్టు

మిర్యాలగూడ
పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న అమాయక సిబ్బంది ఉద్యోగులను టార్గెట్ గా పెట్టుకొని, స్వైపింగ్ మిషన్ల ఆప్షన్లను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1,80,000 నగదు క్రెడిట్ కార్డ్స్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం. గతంలో పెట్రోల్ బంక్ లో పనిచేసి స్వైపింగ్ మిషన్లపై అవగాహన పెంచుకున్న ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు  జిల్లాకు చెందిన ఐదుగురు  ముఠా సభ్యులు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. హాస్పిటల్ ఖర్చులకోసం డబ్బులు అత్యవసరంగా కావాలంటూ ,పెట్రోల్ బంకుల వద్ద క్రెడిట్ కార్డు  స్వైపింగ్ చేసి కావలసిన డబ్బులు తీసుకుని, "void"అనే ఆప్షన్ ద్వారా  తిరిగి తమ ఖాతాల్లోకి  డబ్బులు కొట్టేస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట మిర్యాలగూడ నల్లగొండ ప్రాంతాలలోని పలు పెట్రోల్ బంకుల్లో ఈ తర హ సైబర్ నేరాలకు పాల్పడ్డట్టు చెప్పారు. ఇటువంటి నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Related Posts