YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ నకిలీ నియామక పత్రాలు... చిక్కుల్లో మాజీ మంత్రులు

టీటీడీ నకిలీ నియామక పత్రాలు... చిక్కుల్లో మాజీ మంత్రులు

విజయవాడ, ఆగస్టు 5,
మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ చిక్కుల్లో పడ్డారు. ఇద్దరిపై భారీగా ఫిర్యాదులు వచ్చాయి.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణలో బాధితులు జనసే పార్టీ ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి ఫిర్యాదు చేశారు. టీటీడీలో ఉద్యోగాల ఇప్పిస్తామని చెప్పి మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్‌ల పేరుతో గీతా మాధురి అనే మహిళ ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షలు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. దాదాపు 40మంది దగ్గర డబ్బులు తీసుకుని.. అప్పటి ఈవో ధర్మారెడ్డి సంతకాలతో నియామక పత్రాలు, ఐడీ కార్డులు ఇచ్చి మోసం చేసినట్లు ఫిర్యాదు చేశారు.గతంలోనే ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. తాము చెల్లించిన రూ.5లక్షలు తిరిగి ఇప్పించి తమకు న్యాయం చేయాలని వారు రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే నాగమాధవి వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు.. బాధితులకు న్యాయం చేయాలని, నకిలీ నియామక పత్రాలపై విచారణ చేపట్టాలన్నారు. తాను పనిచేస్తున్న కంపెనీ తనతో పాటు చాలామంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదని.. ఆరు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ అనే మహిళ వినతిపత్రం అందజేశారు. పెనుకొండ మండలం నాగలూరుకు చెందిన పల్లపు మంజునాథకు తాతల ద్వారా సంక్రమించిన 5 ఎకరాల భూమిని తన చిన్నాన్న అయిన శనివారమప్ప వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి దౌర్జన్యంగా తీసుకున్నారని జనసేన పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ నేత నాగలూరు బాబురెడ్డి ద్వారా బెదిరింపులు చేసి రికార్డులు మార్చారని, తనకు న్యాయం చేయాలని కోరారు. 2024 జనవరిలో పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్లకు సంబంధిన పోస్టుల విషయంలో వైఎస్సార్‌సీపీ నేతలు అన్యాయం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. . మొదటి లిస్టులో సెలక్ట్ చేసి సర్టిఫికేట్‌ ధ్రువీకరణ కూడా పూర్తయిన వారిని తుదిలిస్టులో తొలగించారని, ఆ పోస్టులను కొందరికి అమ్ముకున్నారని చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో 210 పోస్టులకు 137 మంది పేర్లు తొలగించారని, తమకు న్యాయం చేయాలని కోరారు.వైఎస్సార్‌సీపీ నేతలు కడప జిల్లాలోని పోలతల దేవస్థానంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టు విషయంలో నిబంధనలు పట్టించుకోకుండా.. అర్హత లేని వారికి ఇష్టానుసారం పోస్టును కట్టబెట్టారని, రాత పరీక్ష రాసిన వారికి అన్యాయం చేశారని జనార్థన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.. తమనకు న్యాయం చేయాలన్నారు. జనసేన పార్టీ సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధి ఒకరు అందుబాటులో ఉంటారు.. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేయొచ్చు.

Related Posts