అమరావతి
ఐఏఎస్ అనేది చాలామంది కల. కలెక్టర్ అయ్యారు అంటే చాలా బాధ్యతగా ఉండాలి.
అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టకపోతే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. సోమవారం అయన జిల్లా కలెక్టర్లతో భేటీ అయ్యారు.సీఎం మాట్లాడుతూ సరిగా పనిచేయకపోతే మార్పులు కచ్చితంగా ఉంటాయి. గత ప్రభుత్వంలో జరిగిన విద్వంశాలకి మీరు కూడా సజీవ సాక్ష్యాలు. గత ముఖ్యమంత్రి గెలాక్సీ గ్రానైట్ మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎలాంటి పరిపాలన చేసారో అర్థం చేసుకోవాలి. ఒక న్యూ ఇన్నోవేషన్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం. సంక్షేమ పథకాలను సిన్సియర్ గా ప్రజల వద్దకు చేర్చాలి. సంపద సృష్టించాలి. వినూత్నంగా ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వినూత్న విధానాలు గతంలో తీసుకొచ్చాం. ఇప్పుడు పి 4 మోడల్ వచ్చింది. కొత్త విధానాలను,ఆలోచనలు అంది పుచ్చుకోవాలి. గత ప్రభుత్వంలో బటన్ నొక్కడం తప్ప నేరుగా లబ్ధిదారుల వద్దకు ఎప్పుడు వెళ్ళలేదని అన్నారు.
బలవంతంగా జనాల్ని తీసుకొచ్చి సభలు పెట్టడం తప్ప చేసింది ఏం లేదు. పేదరికం పారద్రోలడానికి ఏం చేయాలో అధికారులు ఆలోచన చేయాలి. అందరం సామాన్య కుటుంబాల్లో పుట్టాము. మనకి ఒక అవకాశం వచ్చింది... కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాము. ఊర్లో మనతో పాటు ఉన్న చాలా మంది ఇంకా అది స్థితిలో ఉన్నారు. పేదరిక నిర్మూల చేయడం అసాధ్యమేమి కాదు. టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుంది. గంటలు తరబడి మీటింగ్ లు ఈ ప్రభుత్వంలో ఉండవు. కానీ ప్రాధాన్యాలను తగిన విధంగా పరిపాల మీద అధికారులు దృష్టి పెట్టాలి. అధికారులు మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. అధికారుల ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. మీ ప్రవర్తన కారణంగా పై స్థాయిలో ఉన్న అందరికీ చెడ్డపేరు వస్తుంది. సమయపాలన అధికారులకు కచ్చితంగా ఉండాలి. ఇది పొలిటికల్ గవర్నమెంట్. డిక్టేటర్స్ పాలన కాదని అన్నారు.
ఐదేళ్ల తర్వాత ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాల్సింది మేము. ఐదేళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు. స్థానిక ప్రజా ప్రతినిధులే ఉంటారు. మూడు నెలలకు ఒకసారి నేను కూడా సమీక్ష చేసుకుంటూ ఉంటాను. సింపుల్ మరియు ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఉండాలి. చెట్లను నరకడం , రెడ్ కార్పెట్లు వేయడం, నిర్బంధ అరెస్టులు చేయడం, సామాన్యులును ఇబ్బంది పెట్టడం చేయకూడదని అన్నారు. ఏదైనా సర్వీస్ మోటో లోనే పరిపాలన ఉండాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొస్తుంది. మంచి ఫలితాలను పొందుతుంది. ఈ యాప్ ద్వారా రియల్ టైంలో పరిపాలన సక్రమంగా చేయొచ్చు. అధికారులు ఏం చేయాలి, విధంగా చేయాలి అనే దాని పై పూర్తి క్లారీటితో ఉండాలి. తప్పు చేసిన వారిని వదిలేది లేదు.. పొలిటికల్ విక్టీమైజేషన్ ఉండకూడదని అన్నారు.
విష ప్రచారం చేసే గురించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులే ఆ ఆరోపణలను తిప్పి కొట్టాలి. 25 సంవత్సరాల క్రిందటే విజన్ 20-20 తీసుకొచ్చాను. అప్పుడు అందరు నవ్వుకున్నారు. కానీ ఈరోజు ఎంతో అద్భుత ఫలితాలు సాధిస్తుందని అన్నారు.
100 రోజులు టార్గెట్ పెట్టుకున్నాము. 100రోజుల్లో ఏం చెయాలనుకున్నామో అవి అమలు అయ్యోలా అధికారులు పని చేయాలి. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తాము. కలెక్టర్లు ఎప్పుడు ఆఫీసులో కూర్చోవడం వద్దు..... బయటికి వెళ్లాలి. రిమోట్ ఏరియాలకు కూడా వెళ్ళాలి..అక్కడ సమస్యలను తెలుసుకోవాలి. అధికారులతో పాటు మంత్రులకు కూడా ఫీల్డ్ విజిట్లు చేస్తూ ఉండాలి. త్వరలో నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. 95 చంద్రబాబును చూస్తారని నేను ఎప్పుడో చెప్పాను. అప్పుడు అధికారులు ఏ విధంగా పరుగులు పెట్టించాను... ఇప్పుడు కూడా పరుగులు పెట్టిస్తానని అన్నారు. మాతో పాటు అధికారులు కూడా పని చేస్తేనే సరైన పరిపాలన అందిచగలం. కుటుంబానికి ఉండే అవసరాలు ఏంటి అనే దానిపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో మౌళిక సదుపాయాలు మీద దృష్టి పెట్టాలి. స్ట్రీట్ లైట్స్, రోడ్లు, ఇతర సదుపాయాలు మీద ఫోకస్ చేయాలి. ఎయిర్పోర్టులు,పోర్టుల అభివృద్ధి చేసుకోవాలి. జీరో పోవర్టీ, నదుల అనుసంధానం చేయడం ద్వారా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సంప్రదాయ కలెక్టర్స్ లా కాకుండా.. ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి. వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్లీ అనే విధంగా కలెక్టర్స్ పని చేయాలని సూచించారు....