అనంతపురం జిల్లా
అనంతపురం నగరంలోని, రామ్ నగర్ సమీపంలోని ఎస్బిఐ ఎటిఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఎటిఎంను దొంగలు పగులగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. - ఆదివారం ఉదయం ఎటిఎంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను పగలగొట్టి దాదాపు రు. 30 లక్షల నగదును దొంగిలించారు. ఎటిఎం గదిలో అలారం ఉన్నప్పటికీ పనిచేయలేకపోవడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు చుట్టపక్కల ఉన్న సిసి కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి దొంగతనం చేశారు. - ఏటీఎం సెంటర్ కి సెక్యూరిటీ సిబ్బంది లేరు.. అందులోనూ అలారం సిస్టం కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. దీనిపై బ్యాంకు అధికారులు నోరు విప్పడం లేదు. తామ్స్ సీఎంఎస్ అనే ఏజెన్సీ నగరంలోని పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతోంది. - ఏటీఎంలో నగదును అప్లోడ్ చేయడం ఈ ఏజెన్సీకి ఎస్బిఐ బ్యాంక్ అధికారులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.