- పక్షవాత బాధితులకు పనితోనే మేలు...
- ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ సోరస్కీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు
పక్షవాతం నుంచి కోలుకున్నాక తిరిగి పనిచేసే వారి మెదడు చురుగ్గా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగ బాధ్యతలతో క్రమశిక్షణగల జీవితాన్ని గడిపే వారు మిగతా వారికంటే తొందరగా కోలుకుంటారని శాస్త్రవేత్తలు వివరించారు. ఈమేరకు 252 మంది వలంటీర్లపై జరిపిన అధ్యయ నంలో ఈ విషయం వెల్లడైందన్నారు. పరిశోధనలో భాగంగా వలంటీర్ల ఆరోగ్య చరిత్రను పరిశీలించారు.
ఇందులో పక్షవాతం బారిన పడక ముందు ఉద్యోగం(ఏదో ఓ వ్యాపకం ఉన్నవారు) చేస్తూ.. పక్షవాతం ప్రభావం నుంచి కోలుకున్నాక తిరిగి ఆఫీసు బాధ్యతలను నిర్వర్తిం చేవారి మెదడు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పారు. నిరుద్యోగులు, పదవీ విరమణ చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకునే వారి మెదడు అంత వేగంగా కోలుకోలేదని వివరించారు. వీరిపై పక్షవాత ప్రభావం దీర్ఘకాలంపాటు కొనసాగుతుందని పరిశీలించి కనుగొన్నట్లు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ సోరస్కీ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.