YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి

రుణమాఫీ కాలేదా-ఈ హెల్ప్ లైన్ కు కాల్ చేయండి

హైదరాబాద్,
తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాపీ అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో రూ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు విడతల నిధులు విడుదల చేసింది. రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15 లొగా మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పలు కారణాలతో రుణమాఫీ అందలేదని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం బీఆర్ఎస్ హెల్ప్ లైన్ ప్రారంభించింది.
రైతు రుణమాఫీ అర్హత ఉన్నా చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేస్తామని చెప్పి. ఎనిమిది నెలలు గడిచినా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రుణమాఫీ జరగని రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున హెల్ప్లైన్ అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. 83748 52619 నంబర్కు ఫోన్ చేసి రైతులు వివరాలు చెప్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రుణాలు మాఫీ జరిగేలా చూస్తామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారని నిరంజన్ రెడ్డి లెక్కలు చెప్పారు. ఇప్పటివరకూ 16 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణమాఫీకి మొదట రూ.40 వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పి తర్వాత రూ.30 వేల కోట్లకు తగ్గించారని, బడ్జెట్లో రూ.25 వేల కోట్లు మాత్రమే కేటాయించారని వివరించారు. రుణమాఫీ కోసం రైతు బంధును నిలిపివేసారని విమర్శించారు. కాంగ్రెస్ అమలు చేస్తామన్న రైతు భరోసా కోసం ఏటా రూ.30 వేల కోట్లు ఖర్చవుతాయని వివరించారు. ఇప్పటివరకూ రైతు భరోసాపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ హాయంలో కేవలం రైతుబంధు కోసమే సీజన్ కు రూ.7,500 కోట్ల నిధులు ఖర్చు పెట్టామని చెప్పారు. 2014-18 మధ్య రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తేనే రూ.16 వేల కోట్లు ఖర్చయిందన్నారు. కానీ, కాంగ్రెస్ రూ.లక్షా 50 వేల వరకు రుణమాఫీ చేశామని చెప్తున్నప్పటికీ.. కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే ఖర్చయిందని వివరించారు. ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హత ఉన్న అనేక మంది రైతులకు రుణమాఫీ చేయకుండా అనర్హులను చేసారని మండిపడ్డారు.

Related Posts